మద్యనిలపై సమాచారం ఇవ్వడానికి టోల్ ఫ్రీ నెంబర్స్ ..!

ఎన్నికల ప్రవర్తన నియమాలు లోబడి మద్యం విక్రయాలు సరఫరా నిలువులపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసినట్లుగా సంగారెడ్డి జిల్లాఎక్సైజ్ సూపర్డెంట్ డి గాయత్రి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు కల్తీ మద్యం అక్రమ సరఫరా, నిలువలపై ప్రజలు సమాచారం అందించుటకు కమిషన్ ఆఫీస్ టోల్ ఫ్రీ నెంబర్ 1800 4252523 నెంబర్ కి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

మద్యనిలపై సమాచారం ఇవ్వడానికి టోల్ ఫ్రీ నెంబర్స్ ..!

హత్నూర, మన సాక్షి:

ఎన్నికల ప్రవర్తన నియమాలు లోబడి మద్యం విక్రయాలు సరఫరా నిలువులపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసినట్లుగా సంగారెడ్డి జిల్లాఎక్సైజ్ సూపర్డెంట్ డి గాయత్రి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు కల్తీ మద్యం అక్రమ సరఫరా, నిలువలపై ప్రజలు సమాచారం అందించుటకు కమిషన్ ఆఫీస్ టోల్ ఫ్రీ నెంబర్ 1800 4252523 నెంబర్ కి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

ALSO READ : మహిళలకు, రైతులకు భారీ గుడ్ న్యూస్.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో సంచలన హామీలు..!

మరియు సంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ సూపర్డెంట్ కార్యాలయం టోల్ ఫ్రీ నెంబర్ 08455 276385, ఎక్సైజ్ సూపర్డెంట్ నెంబర్ 87126 58904, సంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్డెంట్ 87126 58907, సంగారెడ్డి స్టేషన్ ఇన్స్పెక్టర్ నెంబర్ 87126 58912,

పటాన్చెరు స్టేషన్ ఎక్సైజ్ నెంబర్ 87126 58913, ఆందోల్ ఎక్సైజ్ స్టేషన్ నెంబర్ 87126 58916, జహీరాబాద్ స్టేషన్ ఎక్సైజ్ నెంబర్ 87126 58914, నారాయణఖేడ్ స్టేషన్ నెంబర్ 87126 58924, సంగారెడ్డి జిల్లా డిటిఎఫ్ నెంబర్ 87126 58917. పైన తెలిపిన నెంబర్లకు సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.

ALSO READ : మిర్యాలగూడ : బీఆర్ఎస్ కు భారీ షాక్.. మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ లో చేరిక..!

మరియు వినియోగదారులు కొనుగోలు చేసిన మద్యం సరైనదా లేదా తెలుసుకునేందుకు గూగుల్ ప్లే స్టోర్ నందు verit మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని అందులో మద్యం సీసా పై గల హలో గ్రామ్ ను స్కాన్ చేసినట్లయితే మద్యం సీసా యొక్క వివరాలు మద్యం ధర, మద్యం తయారీ కంపెనీ, పరిమాణం, ఎమ్మార్పీ , బ్యాచ్ నెంబర్ , తయారుచేసిన తేదీ జారీ చేసిన డిపో, మద్యం దుకాణ పేరు కనిపిస్తుందని పేర్కొన్నారు.

ఒకవేళ బాటిల్ స్కాన్ చేసిన తర్వాత ఎలాంటి సమాచారం కనిపించని యెడల అట్టి సమాచారమును పైన తెలిపినటువంటి నెంబర్లకు అందించగలరు మరియు గూగుల్ ప్లే స్టోర్ యందు ఎక్సైజ్ శాఖ వారి (verit app) విరిట్ అప్ డౌన్లోడ్ చేసుకోగలరని సంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ గాయత్రి తెలిపారు.

ALSO READ : ఐటి సోదాల్లో రూ. 5 కోట్లు స్వాధీనం..?