Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజాతీయం

BREAKING NEWS : టాప్ 10 బ్రేకింగ్ న్యూస్.. (28/07/2025)

BREAKING NEWS : టాప్ 10 బ్రేకింగ్ న్యూస్.. (28/07/2025)

మన సాక్షి, వెబ్ డెస్క్:

తెలుగు రాష్ట్రాల్లో సోమవారం టాప్ 10 బ్రేకింగ్ న్యూస్ మన సాక్షి అందిస్తుంది. మన సాక్షిని ఫాలో అవ్వండి.

హైదరాబాద్‌: నేడు సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్‌ భేటీ.. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కమిషన్‌ ఇవాళ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే ఛాన్స్‌.. ఇప్పటికే విద్యుత్‌ సంస్థల్లో అక్రమాలపై ప్రభుత్వానికి అందిన కమిషన్‌ నివేదిక.. మంత్రివర్గ ఆమోదం తర్వాత రెండు నివేదికలపై చర్యలు తీసుకోనున్న ప్రభుత్వం

——— ——

ఇవాళ హైదరాబాద్‌కు కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌.. మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో ఉండనున్న మీనాక్షి.

—— ———-

కొమురం భీం జిల్లా: నేడు జిల్లా కలెక్టరేట్ ఎదుట మహా ధర్నాకు ఆదివాసి సంఘాల పిలుపు.. జీవో నంబర్ 49ని రద్దు చేయాలని డిమాండ్ తో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ధర్నా చేయనున్న ఆదివాసి హక్కుల పోరాట సమితి.. ఇప్పటికే జీవో నంబర్ 49 ని నిలుపుదల చేసిన ప్రభుత్వం

——— —–‘

నిజామాబాద్ : నేడు జిల్లాలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పర్యటన.. జిల్లా కేంద్రంలో జరిగే వన మహోత్సవం తో పాటు వివిధ ఆలయాల పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం లో పాల్గొననున్న నేతలు

———- ——-

రాజన్న సిరిసిల్ల జిల్లా: మొదటి శ్రావణ సోమవారం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు నిర్వహించిన ఆలయ అర్చకులు.. తెల్లవారుజామునుండే ధర్మగుండంలో స్నానాలు ఆచరించి, స్వామివారిని దర్శించుకోవడానికి బారులు తీరిన భక్తులు.. స్వామివారి దర్శనానికి నాలుగు గంటల సమయం, ఆర్జిత సేవల రద్దుచేసి భక్తులకు లఘు దర్శనానికి అనుమతి.

——– ——-

మెదక్ నర్సాపూర్ నియోజకవర్గంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న ఎంపీ రఘునందన్ రావు

———- ——

సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో MRPS అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పర్యటన.. పెన్షన్ల పెంపు ధర్నాపై సన్నాహక సమావేశంలో పాల్గొననున్న మందకృష్ణ.

————

నిజామాబాద్ : శ్రీరాం సాగర్ కు భారీగా వరద.. ఇన్ ఫ్లో 68, 516 క్యూసెక్కులు.. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు.. ప్రస్తుత నీటి మట్టం 1072 అడుగులు

——— ——

Ap సీఎం చంద్రబాబు సింగపూర్ సోమవారం టూర్.. ఎయిర్ బస్, హనీవెల్, ఎవర్వోల్ట్ ప్రతినిధులతో సమావేశాలు.. రెండోరోజు పర్యటనలో సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో సహా… పలు సంస్థల అధిపతులతో సమావేశం.. నగరాల అభివృద్ధి, క్రీడలు, పోర్ట్ ఆధారిత పరిశ్రమలపై వారితో చర్చ

——— ——

ఢిల్లీ : నేడు పార్లమెంట్‌లో ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చ.. లోక్‌సభలో 16 గంటలు, రాజ్యసభలో 9 గంటల పాటు కొనసాగనున్న చర్చ.. ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో జరగనున్న చర్చ.. లోక్‌సభలో చర్చను ప్రారంభించనున్న రాజ్‌నాథ్‌ సింగ్.

MOST READ : 

  1. Nalgonda : 15 నెలల కొడుకుని బస్టాండ్ లో వదిలేసిన యువతి.. ప్రియుడితో జంప్.. సర్వత్రా చర్చ..!

  2. Harihara Veeramallu : ఢిల్లీ ఏపీ భవన్ లో హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన..!

  3. Treatment : కప్పింగ్ తెరపి హిజామా.. నొప్పుల నివారణకు వినూత్న వైద్యం.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

  4. TG News : తెలంగాణ రైతులకు ప్రభుత్వం భారీ శుభవార్త.. ఆ రైతులకు ఎకరానికి రూ.4 వేలు బ్యాంకు ఖాతాలలో జమ..!

  5. Fertilizer : డి సి ఓ కీలక ఆదేశం.. ఉదయం 8 గంటల లోపే షాపులు తెరవాలి..!

మరిన్ని వార్తలు