Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైంరాజకీయం

AP CM : ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబంలో విషాదం..!

AP CM : ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబంలో విషాదం..!

హైదరాబాద్, మన సాక్షి :

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబంలో విషాదం నెలకొన్నది. చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు (72) కన్నుమూశారు. హైదరాబాదులోని ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు.

అనారోగ్య కారణంగా ఈనెల 14వ తేదీన ఆయన ఆసుపత్రిలో చేరారు. కార్డియాక్ అరెస్టుతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. 1994 – 1999 మధ్య ఆయన చంద్రగిరి శాసనసభ్యులుగా పనిచేశారు. నారా రామ్మూర్తి నాయుడు కుమారుడు సినీ హీరో నారా రోహిత్.

రామ్మూర్తి నాయుడు మృతితో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్నది. సోదరుడు మృతి చెందడంతో మహారాష్ట్ర టూర్ విరమించుకున్న చంద్రబాబు నాయుడు హైదరాబాదులోని ఏఐజి ఆసుపత్రికి రానున్నారు. ఆదివారం స్వగ్రామమైన నారావారి పల్లెలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్, సినీ హీరో నారా రోహిత్ లు ఇప్పటికే ఆసుపత్రిలో ఉన్నారు. నారా రామమూర్తి నాయుడు మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలియజేశారు.

MOST READ : 

మరిన్ని వార్తలు