శాలిగౌరారం మండలంలో విషాదకర ఘటన.. వరి కొయ్య మంటల్లో చిక్కుకొని రైతు మృతి..!
ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకుని ఓ రైతు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని ఎన్జీ కొత్తపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.

శాలిగౌరారం మండలంలో విషాదకర ఘటన.. వరి కొయ్య మంటల్లో చిక్కుకొని రైతు మృతి..!
శాలిగౌరారం, మనసాక్షి :
ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకుని ఓ రైతు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని ఎన్జీ కొత్తపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్ ఐ డి. సైదులు తెలిపిన వివరాల ప్రకారం..
గ్రామానికి చెందిన నూనెముంతల సత్తయ్య (72)తన వ్యవసాయ పొలంలో వరి కొయ్యలకు నిప్పు పెట్టే క్రమంలో ఒక్కసారిగా మంటలు భారీగా చెలరేగాయి.దీంతో మంటలు ఆయనను చుట్టుముట్టడంతో పాటు తీవ్రంగా వ్యాపించిన పొగలో చిక్కుకుని ఊపిరి ఆడక అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.ఈ ఘటనను గమనించిన స్థానికులు, బంధువులు వెంటనే అతన్ని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది.
మంటల ప్రభావంతో సత్తయ్య చేతులు, కాళ్లు,ముఖంపై తీవ్ర గాయాలు అయ్యి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుమారుడు వెంకన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు.అనంతరం శవపరీక్ష నిమిత్తం మృత దేహాన్ని నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ ఐ సైదులు తెలిపారు.









