Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంసిద్దిపేట జిల్లా

BREAKING : కేంద్రంలో అధికార మార్పిడి ఖాయం..!

BREAKING : కేంద్రంలో అధికార మార్పిడి ఖాయం..!

రాష్ట్రంలో కాంగ్రేస్‌ అత్యధిక ఎంపీ స్థానాలను గెలుచుకుంటుంది.

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి సి.దామోదర్‌ రాజనర్సింహ

జోగిపేటలో ఓటుహక్కు వినియోగించుకున్న మంత్రి…

అందోలు,మనసాక్షిః

మారుతున్న రాజకీయ పరిణామాలతో దేశంలో ప్రభుత్వ మార్పు ఖాయమని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ మంత్రి సీ.దామోదర్‌ రాజనర్సింహ అన్నారు. సోమవారం జోగిపేటలోని వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయంలోని 196 పోలింగ్‌ కేంద్రంలో తన కూతురు త్రిషతో కలిసి వచ్చి ఓటు హక్కును వినియోగించకున్నారు.

అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ కేంద్రంలో ప్రభుత్వ మార్పును దేశ ప్రజలు కోరుకుంటున్నారనడానికి నిదర్శనం ప్రస్తుతం మారుతున్న రాజకీయ పరిణామాలే కారణమన్నారు. రాష్ట్రంలో ప్రజలు ప్రభుత్వ మార్పును కోరుకొని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రేస్‌ పార్టీకి అధికారం ఇచ్చినట్లుగానే దేశ ప్రజలు కూడా కేంద్రంలో కాంగ్రేస్‌ పార్టీకి అధికారం ఇవ్వనున్నారన్నారు.

ఇండియా కూటమి అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని రాహుల్‌ గాంధీ ప్రధాని కావడం ఖాయమని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రేస్‌ ప్రభుత్వం అమలు పరుస్తున్న ఆరుగ్యారంటీ పథకాలకు ప్రజలు ఆకర్షితులై కాంగ్రేస్‌ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రేస్‌ పార్టీ 12 లోకసభ స్థానాలను గెలుచుకుంటుందన్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని జహీరాబాద్, మెదక్‌ పార్లమెంట్‌ స్థానాలను కాంగ్రేస్‌ గెలుచుకోవడం ఖాయమన్నారు.

రాష్ట్రంలో చాలా చోట్ల త్రిముఖ పోటీ ఉన్నప్పటికిని ప్రధానంగా కాంగ్రేస్‌ పార్టీ తరువాతి స్థానం కోసమే బీజేపీ, బీఆర్‌ఎస్‌లు పోటీ పడుతున్నాయన్నారు. ప్రస్తుత కాంగ్రేస్‌ ప్రభుత్వంపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివద్ది చేసేందుకు కాంగ్రేస్‌ ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు.

ఆయన వెంట మున్సిపల్‌ చైర్మన్‌ జి.మల్లయ్య, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ప్రవీణ్‌కుమార్, కౌన్సిలర్లు సురేందర్‌ గౌడ్, ఆకుల చిట్టిబాబు, కే.నాగరాజు, దుర్గేష్, చందర్‌ తో పాటు పలువురు నాయకులు ఆయన వెంట ఉన్నారు.

ALSO READ : 

Nalgonda : క్యూలో నిల్చోని నల్గొండ జిల్లా కలెక్టర్.. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు..!

SRH : ఎస్ ఆర్ హెచ్ కు బిగ్ షాక్.. ఇండియా వదిలి వెళ్లిపోయిన కామిన్స్, హెడ్..!

WhatsApp : వాట్సాప్ లో రెండు కొత్త ఫీచర్లు.. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి..!

Work From Home : వర్క్ ఫ్రం హోం ఉద్యోగం కావాలా..? లక్షల జీతం.. ఇలా పొందండి..!

Gas Stove : ఇంట్లో గ్యాస్ స్టవ్ మూడు బర్నర్ ఉంటే మంచిదా..? కాదా..?

మరిన్ని వార్తలు