Telangana : బీ ఈడి, డి ఈడీ అభ్యర్థులకు గుడ్ న్యూస్… మళ్లీ టెట్.. ఇవీ విధి విధానాలు..!
Telangana : బీ ఈడి, డి ఈడీ అభ్యర్థులకు గుడ్ న్యూస్… మళ్లీ టెట్.. ఇవీ విధి విధానాలు..!
హైదరాబాద్, మనసాక్షి :
తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలనుకునే వారికి గుడ్ న్యూస్ తెలియజేసింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కంటే ముందు నిర్వహించాల్సిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) 2023 ని నిర్వహించనున్నది. బీఈడీ, డిఈడి అభ్యర్థులు ఈ పరీక్షను రాసుకునే అవకాశం ఉంది.
టీఎస్ టి ఈ టి (TS TET) 2023 నిర్వహించడానికి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బీ ఈడీ , డి ఈ డి కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు ఈ టెస్ట్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి ఆరు మాసాలకు ఒకసారి నిర్వహించాల్సిన టెట్ పరీక్ష ఏడాది గడుస్తున్నా.. నిర్వహించలేదు.
ఎన్నికలు సమీపిస్తున్నందున ఉపాధ్యాయ పోస్టుల రిక్రూట్మెంట్ భారీగా ఉండే అవకాశం ఉంది. అందుకుగాను ముందే నిర్వహించాల్సిన టెట్ పరీక్షను నిర్వహించనున్నారు.
2022 జూన్ 12న టెట్ పరీక్ష నిర్వహించారు. అభ్యర్థులకు మార్చి 26 2022 నుంచి ఏప్రిల్ 12 20 22 వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించి. జూన్ 12న పరీక్ష నిర్వహిఈ ఏడాది మళ్లీ టెట్ పరీక్ష నిర్వహించనున్నారు.
🟢ఎక్కువమంది చదివిన వార్తలు.. మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి..👇
1. Gpay : గూగుల్ పే వాడుతున్నారా.. అయితే మీకు అదిరిపోయే రెండు శుభవార్తలు..!
2. Reshan Card : రేషన్ కార్డు ఉన్నవాళ్లందరికీ.. గుడ్ న్యూస్..!
2. Dharani : ధరణి పోర్టల్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!
4. Metro : మెట్రో రైల్ లో బంపర్ ఆఫర్.. స్మార్ట్ కార్డులు..!
5. TSRTC : ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ రూట్లలో 10 శాతం రాయితీ..!
శుక్రవారం హైదరాబాదులోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో సుదీర్ఘ సమస్యలతో పాటు టీచర్ పోస్టుల భర్తీ, మన- ఊరు మనబడి పురోగతిపై మంత్రివర్గ ఉప సంఘం చర్చించింది .
ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు హరీష్ రావు , తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి ,జగదీశ్ రెడ్డి తోపాటు విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కాగా ఏడాది ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసే అవకాశం ఉంది. అందుకుగాను ముందస్తుగా నిర్వహించాల్సిన టెట్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.









