Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవ్యవసాయం
నల్గొండ : అకాల వర్షం.. అన్నదాతకు భారీ నష్టం
నల్గొండ : అకాల వర్షం.. అన్నదాతకు భారీ నష్టం
మాడ్గులపల్లి, మనసాక్షి:
రైతులు ఆరుగాలం పండించి కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన పంటలకు ..అకాల వర్షాలతో అనేక ఇబ్బందులు పడుతున్నారు.
శుక్రవారం కురిసిన భారీ వర్షానికి నల్గొండ జిల్లా గుడ్ర, వారిగూడెం, చెరువుపల్లి గ్రామాల్లో వేములపల్లి పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లో నీరు నిలిచి ధాన్యం రాశులు తడిసిపోయాయి.
తేమ శాతం వచ్చిన ధాన్యం కూడా వర్షం నీరు నిలిచి తడిసిపోయాయి అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తడిసిన ధాన్యం ను కూడా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.









