వెలగని సెంట్రల్ లైటింగ్ విద్యుత్ దీపాలు

మండల పరిధిలోని (మాల్ ) వెంకటేశ్వర నగర్ హైదరాబాద్ నాగార్జునసాగర్ రహదారి వెంట ఇటీవల ఏర్పాటు చేసిన సెంట్రల్ ఐ మాక్స్ స్ట్రీట్ లైట్లు గత 15 రోజుల నుండి వెలగకపోవడంతో రహదారి వెంట అందాకారంగా మారింది. ప్రతినిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిపై వేలాది వాహనాలు వెళ్తూ ఉంటాయి.

వెలగని సెంట్రల్ లైటింగ్ విద్యుత్ దీపాలు

చింతపల్లి, మనసాక్షి:

మండల పరిధిలోని (మాల్ ) వెంకటేశ్వర నగర్ హైదరాబాద్ నాగార్జునసాగర్ రహదారి వెంట ఇటీవల ఏర్పాటు చేసిన సెంట్రల్ ఐ మాక్స్ స్ట్రీట్ లైట్లు గత 15 రోజుల నుండి వెలగకపోవడంతో రహదారి వెంట అందాకారంగా మారింది. ప్రతినిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిపై వేలాది వాహనాలు వెళ్తూ ఉంటాయి.

రాత్రి సమయం కావడంతో పాదచారులు ద్విచక్ర వాహనదారులు చీకటి రోడ్డుపై వెళ్లాలంటే ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో తెలియని పరిస్థితి దాపురించింది. ఫిబ్రవరి 2 నుండి గ్రామపంచాయతీ సర్పంచ్ ల పాలన ముగియడంతో ప్రత్యేక అధికారులు పంచాయతీ కార్యదర్శులు గ్రామాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది.

ALSO READ : చెరువుమాధారం చెరువు కట్ట పై ఉద్రిక్తత…! చేపల టిప్పర్లను అడ్డుకున్న గ్రామస్తులు..!

సుమారు 5 లక్షల వరకు ప్రభుత్వం నిధులు వెచ్చించి సెంట్రల్ స్టేట్ లైట్లను ఏర్పాటు చేసింది. ఈ లైట్లు మూన్నాళ్ళ ముచ్చటగా కొన్ని రోజులు బాగానే వెలిగాయి. ప్రస్తుతం ఆ వీధిలైట్లు కొన్ని కాలిపోయి దర్శనమిస్తున్నా వాటిని పట్టించుకునే నాథుడు కరువయ్యాడు .

దీంతో రాత్రి సమయంలో అత్యధికంగా ప్రమాదాలు చోటుచేసుకుని పాదచారలు, వాహనదారులు ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇక నాయనా సంబంధిత ప్రత్యేక అధికారులు చొరవ తీసుకొని విద్యుత్ సెంట్రల్ లైట్లు వెలిగే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

ALSO READ : నేడు మేడారం మహా జాతర తొలిఘట్టం.. ఆన్‌లైన్‌లో బంగారం సమర్పణ ప్రారంభం..!