Khammam : నాన్నతో కలిసి శిలపలు తొక్కేది.. మహిళా కూలీలతో మంత్రి పొంగులేటి ఆసక్తికర వ్యాఖ్యలు..!
Khammam : నాన్నతో కలిసి శిలపలు తొక్కేది.. మహిళా కూలీలతో మంత్రి పొంగులేటి ఆసక్తికర వ్యాఖ్యలు..!
నేలకొండపల్లి, మన సాక్షి :
నాకు వ్యవసాయం చేయడం వచ్చు…. వ్యవసాయం పై నాకూ అవగాహన ఉంది…. నాన్న బతికున్నప్పుడు ఆయనతో కలిసి నా చిన్నతనంలో పొలంలో శిలపలు తొక్కేది… ఉండేది మాత్రమే హైదరాబాద్ నేను పుట్టి పెరిగింది కల్లూరు మండలం నారాయణపురంలోనేనని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
నేలకొండపల్లి మండల పర్యటనలో భాగంగా కొంగర సమీపంలోని పొలాల వద్ద పని చేస్తున్న మహిళా కూలీలను చూసి ఆయన కాన్వాయ్ ఆపారు…. వారి వద్దకు వెళ్లి అక్కా చెల్లి అంటూ వారితో సరదాగ కాసేపు ముచ్చటించారు…. ఈ నెల 26వ తేదీ నుంచి అమలు కాబోతున్న పథకాల గురించి వారికి వివరించారు.
ఆ పథకాల జాబితాలో పేర్లు రాని వారు ప్రస్తుతం జరుగుతున్న గ్రామ సభల్లో పేర్లు నమోదు చేసుకుంటే పరిశీలించి ఆ పథకాలను అందిస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే పెన్షన్లు కూడా ఇస్తామని వారితో చెప్పారు…. అక్క చెల్లమ్మలందరూ గాజులు వేయించుకోండని చెబుతూ కొంత నగదు అందజేశారు.
MOST READ :
-
Gold Price : పసిడి ప్రియులకు భారీ షాక్.. హైదరాబాదులో తులం ఎంతంటే..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు కొత్తగా దరఖాస్తుల ఆహ్వానం.. బిగ్ అప్డేట్..!
-
Miryalaguda : రేషన్ కార్డు కోసం ప్రభుత్వ ఉద్యోగుల ధరఖాస్తు.. డబుల్ దరఖాస్తులతో అధికారులకు తలనొప్పి..!
-
Ration Cards : కొత్త రేషన్ కార్డులకు మరో అవకాశం.. ఇవి తప్పనిసరి ఉండాలి.. లేటెస్ట్ అప్డేట్..!
-
SBI : SBI సేవింగ్ అకౌంట్ లో రూ.236 కట్ అవుతున్నాయా.. ఖాతాదారుల గందరగోళం.. ఎందుకంటే..!









