Vande Bharath : తెలంగాణకు మరో వందే భారత్ సెమి హైస్పీడ్ ఎక్స్ ప్రెస్… కొత్త రూట్..!
Vande Bharath : తెలంగాణకు మరో వందే భారత్ సెమి హైస్పీడ్ ఎక్స్ ప్రెస్… కొత్త రూట్..!
హైదరాబాద్, మనసాక్షి :
తెలంగాణకు మరో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు రానున్నది. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలను కలుపుతూ రెండు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు నడుస్తున్నాయి. తాజాగా మరో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు రానున్నది. కొత్త రూట్ తెరపైకి వచ్చింది.
సికింద్రాబాద్ – విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు సంక్రాంతి కానుకగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా సికింద్రాబాద్. – తిరుపతి వందే భారత్ రైలు కూడా ఇటీవలనే ప్రారంభమైంది. ఈ రెండు రైళ్లు కూడా తెలుగు రాష్ట్రాలను కలుపుతూ నడుస్తున్నాయి. ఈ రెండు రైళ్లకు కూడా ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది.
తెరపైకి మరో కొత్త రూట్ :
తాజాగా మరో కొత్త రూట్ తెరపైకి వచ్చింది. భువనేశ్వర్ – హైదరాబాద్ రూట్ లో సెమి హై స్పీడ్ రైలు నడపాలని ఒడిశా ప్రభుత్వం తాజాగా డిమాండ్ చేసింది. అంతేకాకుండా పూరీ – రాయపూర్, పూరీ – హౌరా రూట్ లో కూడా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు నడపాలని ఒడిశా ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. ఒడిశాను కనెక్ట్ చేస్తూ మూడు రూట్లలో వందే భారత్ రైలు నడపాలని ఒడిశా ప్రభుత్వం రైల్వే మంత్రికి రాసిన లేఖలో డిమాండ్ చేసింది.
ఒడిశా నుంచి హైదరాబాద్ కు చాలామంది వచ్చి వలస ప్రజలు స్థిరపడ్డారు. భువనేశ్వర్ – హైదరాబాదులను కలుపుతూ వందే భారత్ ఎక్స్ ప్రెస్ లను నడపాలని, ప్రయాణికుల రాకపోకలను వేగవంతం చేయడానికి వీలు కల్పిస్తుందని ఒడిశా ప్రభుత్వం పేర్కొన్నది. ఒడిశా ప్రభుత్వం చేసిన డిమాండ్ కు రైల్వే శాఖ స్పందిస్తే భువనేశ్వర్ – హైదరాబాద్ రూట్ లో వందే భారత్ రైలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఇది ఇలా ఉండగా తెలంగాణ లో మరో రెండు రూట్ లలో వందే భారత్ రైళ్లు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాచిగూడ. – బెంగళూరు, సికింద్రాబాద్ – పూణే రోడ్లను రైల్వే శాఖ పరిశీలిస్తుంది . రాబోయే నెలలోనే ఈ రెండు రూట్లో వందే భారత రైళ్లు నడవలున్నాయి.
ఇవి కూడా చదవండి ;
AC : ఏసి వాడితే.. కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందా…? ఇలా చేయండి చాలు..!
Samantha : సమంతకు గుడి కట్టిన తెలుగు వీరాభిమాని.. ఎవరబ్బా..!
Curd : వేసవిలో పెరుగు తియ్యగా గట్టిగా ఉండాలంటే సింపుల్… ఇలా చేస్తే చాలు..!
NH 65 : ఎన్ హెచ్ 65 పై 19 హాట్ స్పాట్ లు.. ఎక్కడెక్కడో..? నిధులు మంజూరు ..!










