Samantha : సమంతకు గుడి కట్టిన తెలుగు వీరాభిమాని.. ఎవరబ్బా..!

Samantha : సమంతకు గుడి కట్టిన తెలుగు వీరాభిమాని.. ఎవరబ్బా..!

మనసాక్షి వెబ్ డెస్క్ :

సినిమా నటుల పై అభిమానం పెంచుకొనే వీరాభిమానులు చాలామంది ఉంటారు. హీరోలతో పాటు హీరోయిన్లపై కూడా ఎంతోమంది అభిమానం పెంచుకుంటారు. వారి సినిమాలు విడుదలయితే మొదటి రోజు… మొదటి షో చూడాలనే తపనతో పాటు సినిమా చూడటం… సినిమా థియేటర్ల వద్ద పెద్దపెద్ద కటౌట్లు పెట్టి పూజలు చేయటం చూస్తున్నాం…

 

కానీ ఈ వీరాభిమాని సినీ తారపై పెంచుకున్న అభిమానం కోసం ఏకంగా దేవాలయాన్ని కట్టించాడు. గతంలోనూ సినీ తారలు కుష్బూ, నిధి అగర్వాల్ లకు దేవాలయాలు కట్టి వార్తల్లోకి ఎక్కిన వారు కూడా ఉన్నారు. ఈ సంస్కృతి ఎక్కువగా తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అంతటి అభిమానాన్ని పెంచుకున్న ఆ వీరాభిమాని ఎవరో చూద్దాం.

ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లాకు ఆలపాడు గ్రామానికి చెందిన సందీప్ అనే వ్యక్తి సినీ తార సమంత పై వీరాభిమానం పెంచుకున్నాడు. సామ్ అంటే తనకు పడి చచ్చేంత ఇష్టం… తన అభిమాన సినీతార సమంతకు మయోసైటిట్ బారిన పడిన విషయం తెలుసుకొని మొక్కుబడియాత్రలు సైతం చేశాడు. తిరుపతి, చెన్నై, నాగపట్నం లో మొక్కు యాత్రలు తీర్చుకున్నాడు.

 

అంతేకాకుండా మరో అడుగు ముందుకు వేసి ఏకంగా దేవాలయాన్ని కట్టించాడు. తన ఇంటిలోనే సమంతకు గుడిని నిర్మించాడు. సమంత పుట్టినరోజు ఏప్రిల్ 28వ తేదీన దీనిని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాడు. ఓ తెలుగు వ్యక్తి సినీ తారకు గుడి కడుతున్న విషయం అందరిని ఆకర్షించింది.