వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలి

వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలి

కోదాడ, జూలై 23, మనసాక్షి: కోదాడ పట్నంలోని తహసిల్దార్ కార్యాలయం ముందు ఎంఆర్పిఎస్ కోదాడ నియోజకవర్గం కోఆర్డినేట్ ఏ ఊరి రాజు మాదిగ ఆధ్వర్యంలో చేపట్టిన ఎం ఆర్ పి ఎస్ నాలుగవ రోజు రిలే నిరాహార దీక్షలను శనివారం సిపిఎం పట్టణ కార్యదర్శి ముత్యాలు పూలమాలలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏ ఊరి రాజు మాదిగ మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో హైదరాబాదులో జరిగిన బిజెపి బహిరంగ సభలో నిరసన వ్యక్తం చేసిన ఎమ్మార్పీఎస్ నాయకుల పై ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ నాయకులు చేసిన దాడులను పూర్తిగా ఖండిస్తున్నామన్నారు.

ALSO READ ; అన్న హత్యకు తమ్ముడు సుపారి, హత్య పథకం లీక్ చేస్తున్నాడని యువకుడి హత్య

ఎస్సీ వర్గీకరణకు బిజెపి కట్టుబడి ఉంటే మాదిగలకు ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ వారు చేసే ప్రతి పోరాటానికి అండగా ఉంటామన్నారు. మండల అధ్యక్షులు పులి రాజారామ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఈ దీక్షలో మహాజన సోషలిస్ట్ పార్టీ కోదాడ నియోజకవర్గ కోఆర్డినేట్ ఏ ఊరి రాజు మాదిగ విహెచ్పిఎస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రావి స్నేహలత చౌదరి, మండలాధికారి ప్రతినిధి ఒగ్గు ఏసోబు మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి పిడమర్తి వెంకట్రావు, పట్టణ అధ్యక్షుడు కుడుముల శ్రీను, ఎమ్మార్పీఎస్ గణపవరం గ్రామ శాఖ అధ్యక్షులు పిడమర్తి చిన్న వెంకట్రావ్ లు కూర్చున్నారు.