సీఎం కెసిఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే

మేడం.... ఇండ్లు కట్టుకోవడానికైనా అనుమతులివ్వండి..

సీఎం కెసిఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే

మేడం…. ఇండ్లు కట్టుకోవడానికైనా అనుమతులివ్వండి..!

తుర్కపల్లి, మనసాక్షి : యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని సీఎం దత్తత గ్రామమైన వాసాలమర్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలతో పాటు, ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు.

రెండు సంవత్సరాలు దాటినా ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్నట్లు తూ… తూ మంత్రంగా అధికారుల హడావిడి తప్ప అక్కడ మారింది ఏమి లేకపోవడంతో, గ్రామ ప్రజలు సొంత ఇండ్లను కట్టుకోవడానికి అనుమతి ఇవ్వాలని గ్రామ ప్రజలు ఒత్తిడి చేస్తున్నారని స్థానిక సర్పంచ్‌ పోగుల ఆంజనేయులుతో పాటు పాలకవర్గ సభ్యులు మేడం ఇండ్లు కట్టుకోవడానికైనా అనుమతి ఇవ్వాలంటూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ పమేల సత్పతి కి వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పలుగుల మధు ,వార్డు సభ్యులు మెరుగు సతీష్ ,పలుగుల రజిని కుమార్, కొక్కొండ రాణి, వసంత, మహాలక్ష్మి ,కో ఆప్షన్ సభ్యులు సూరంపల్లి మురళి, కొకొండ సత్తయ్య, దానయ్య ,రాజు తదితరులు ఉన్నారు.