Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ
Vemulapally : విద్యుత్ షాక్ తో పాడి గేదె, దూడ మృతి..!
విద్యుత్ షాక్ తో పాడి గేద దూడ మృతి చెందగా...మరో గేదెకు తీవ్ర గాయాలైన సంఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది..

Vemulapally : విద్యుత్ షాక్ తో పాడి గేదె, దూడ మృతి..!
వేములపల్లి, మన సాక్షి:
విద్యుత్ షాక్ తో పాడి గేద దూడ మృతి చెందగా…మరో గేదెకు తీవ్ర గాయాలైన సంఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని రావులపెంట గ్రామానికి చెందిన సింగరాజు కోటయ్య తన రెండు పాడి గేదలు రోజు మాదిరిగా మేత మేస్తుండగా.. గురువారం రాత్రి ఈదురుగాలులకు వ్యవసాయ క్షేత్రంలో తెగిపడిన విద్యుత్ వైర్ కు తాకి షాక్ తో ఒక గేద మృతి చెందగా..మరో గేదకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాధితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని వేడుకున్నారు.









