Vemulapally : ఆ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు అందరికీ ఆదర్శం..!
మండలంలోని రావులపెంట జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు గుమ్మల స్వాతి తన కుమార్తెను ఆరో తరగతిలో జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో అడ్మిషన్ చేయించారు.

Vemulapally : ఆ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు అందరికీ ఆదర్శం..!
– ప్రభుత్వ పాఠశాలలో తన కుమార్తెకు అడ్మిషన్ చేయించిన ఉపాధ్యాయురాలు
వేములపల్లి, మన సాక్షి:
మండలంలోని రావులపెంట జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు గుమ్మల స్వాతి తన కుమార్తెను ఆరో తరగతిలో జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో అడ్మిషన్ చేయించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు భూక్య లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ… ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నందున ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం జరుగుతుందన్నారు.
ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాల కంటే మెరుగైన విద్యను అందిస్తున్నాయని,హై స్కూల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులు చక్కటి విద్యాభ్యాసం పొందగలుగుతున్నారు.పదవ తరగతి విద్యార్థులు 100 శాతం మంచి మార్కులతో పాసైయ్యారు.చిట్యాల శివ మండల టాపర్ గా 557 మార్కులతో బాసర త్రిబుల్ ఐటీలో సీటు సాధించడం జరిగిందని తెలిపారు.
పాఠశాలలో చదివే 8వ తరగతి విద్యార్థిని నిత్యలేఖకు ఎన్ఎంఎంఎస్ కు సెలెక్ట్ అయిందన్నారు. ఇలాంటి ప్రత్యేక సౌకర్యాలు ఉన్నందున తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ బృందం గుమ్మల స్వాతికి అభినందనలు తెలిపారు.









