వెంకటేశ్వర స్వామి కొండపై ఎమ్మెల్యే భాస్కర్ రావు సతీమణి ప్రత్యేక పూజ

వెంకటేశ్వర స్వామి కొండపై ఎమ్మెల్యే భాస్కర్ రావు సతీమణి ప్రత్యేక పూజ

మిర్యాలగూడ, మనసాక్షి : నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం లో అవంతిపురం కొండపై
శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి, సరస్వతి ఆలయంలో దేవీ నవరాత్రుల సందర్భంగా మూడో రోజు బుధవారం మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు సతీమణి జయ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాలుగో తారీఖున చండీయాగం జరిపిస్తామని ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ త్రిపురనేని శరత్ బాబు దంపతులు అన్నారు. ఈ కార్యక్రమంలో బొప్పన రామకోటేశ్వరరావు దంపతులు, జాస్తి జయశంకర్ దంపతులు, సత్యనారాయణ, శరత్ బాబు దంపతులు , రామ్మూర్తి , కె రాంప్రసాద్, మీనాక్షి ఆలయ సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.