Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుతెలంగాణమంచిర్యాల జిల్లా

వెంకటేశ్వర స్వామి ఆలయంలొ శ్రీవారి పాదాల ప్రతిష్టపన

వెంకటేశ్వర స్వామి ఆలయంలొ శ్రీవారి పాదాల ప్రతిష్టపన

రామకృష్ణాపూర్, మన సాక్షి

మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా బొక్కలగుట్ట గ్రామంలోని ఋష్యమూక పర్వతంపై శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణం సందర్భంగా నూతనంగా శ్రీవారి పాదాలతో ఋశ్యమూక పర్వతం చుట్టు గిరిప్రదక్షిణ అనంతరం గుట్టపై ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నందు శ్రీవారి పాదాలను ప్రతిష్టించడం జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి సుమారు 600 మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది.

ఈ యొక్క పర్వతంపై గత 18 ఏండ్ల క్రితం శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి వారు శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయనిర్మాణం కోసం భూమిపూజ చేయడం జరిగింది.అప్పటినుండి ప్రతి మాఘ శుద్ధ పౌర్ణమి నాడు శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణం చేపట్టడం జరుగుతుంది. ప్రస్తుతం కార్యక్రమం దాతల సహకారంలో నిర్వహించడం జరుగుతుందని త్వరలో చెన్నూర్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బాల్కసుమన్ కృషితో ఋష్యమూక పర్వతంపై గుడి నిర్మాణం పూర్తి చేసుకొని ఈ పర్వతం చుట్టు పచ్చని చెట్లతో పచ్చదనాన్ని ఏర్పాటు చేసుకొంటామని ఈ యొక్క ఆలయాన్ని జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన దేవాలయంగా ఏర్పాటు చేసుకుంటామని ఆలయ కమిటి వారు తెలియజేయడం జరిగింది .

ఈ కార్యక్రమంలో మందమర్రి మండల అధ్యక్షురాలు గుర్రం మంగ శ్రీనివాస్, జడ్పీటీసీ వేల్పుల రవి, పాక్స్ చైర్మన్ ప్రభాకర్ రావు, క్యాతనపల్లి 8వ, వార్డు కౌన్సిలర్ అలుగల శ్రీలత సత్తయ్య, 9వ వార్డు కౌన్సిలర్ పారిపెల్ల తిరుపతి,రైతుబందు కోఆర్డినేటర్ కిషన్ గ్రామ పెద్దలు గ్రామస్తులు శ్రీవారి భక్తులు పాల్గోన్నారు.

మరిన్ని వార్తలు