Miryalaguda : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ 7న జాతికి అంకితం.. సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే బిఎల్ఆర్..!
Miryalaguda : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ 7న జాతికి అంకితం.. సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే బిఎల్ఆర్..!
దామరచర్ల, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల మండలంలోని వీర్లపాలెం వద్ద నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో రెండు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని ఈనెల 7న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు.
బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పవర్ ప్లాంట్ లో సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025 మే నాటికి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను పూర్తిచేసి 4000 మెగావాట్ల విద్యుత్తును గ్రిడ్ కు అనుసంధానం చేస్తామని అన్నారు.
యాదాద్రి పవర్ ప్లాంట్ లోని విద్యుత్ ఉత్పత్తిని జాతికి అంకితం చేసే కార్యక్రమం సీఎం చేతుల మీదుగా 7వ తేదీన జరగనుందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని పవర్ ప్లాంట్ ను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చొరవతోనే పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు వేగంగా జరిగాయని ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్నదని భవిష్యత్తులో విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
MOST READ :
-
Miryalaguda : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చే 7న యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ ప్రారంభం..!
-
TG News : తెలంగాణలో ఉద్యోగాల జాతర.. ఇంటర్ అర్హతతోనే వీఆర్వో ఉద్యోగాలు..!
-
JOBS : నిరుద్యోగులకు ప్రముఖ కంపెనీ శుభవార్త.. లక్షల్లో ప్యాకేజీ, ఖాళీలకు దరఖాస్తుల ఆహ్వానం..!
-
TG News : పేదలకు శుభవార్త.. ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన..!










