Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంసూర్యాపేట జిల్లా

సూర్యాపేట : యువత స్వశక్తితో ఎదగాలి

సూర్యాపేట : యువత స్వశక్తితో ఎదగాలి

డిసిఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్య యాదవ్

సూర్యాపేట, మనసాక్షి

యువత స్వశక్తితో ఎదగాలని డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్య యాదవ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని 42 వ వార్డులో అమ్మ రైస్ షాప్ దుకాణాన్ని ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.

 

యువత ఉన్నతమైన లక్ష్యాలను ఏర్పరచుకొని స్వశక్తితో వాటిని సాధించేలా కష్టపడాలన్నారు. నేటి యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు . అవకాశాలను సృష్టించుకుంటూ స్వయం ఉపాధి పొందేలా వ్యాపారాలు ప్రారంభించడం అభినందనీయం అన్నారు.

 

సూర్యాపేట జిల్లా కేంద్రం వ్యాపార కూడలిగా రూపాంతరం చెందుతుందన్నారు . నాణ్యత ప్రమాలను పాటిస్తూ ప్రజల మన్నలను పొందాలన్నారు. కార్యక్రమంలో అమ్మ రైస్ డిపో నిర్వాహకులు జక్కలి నాగరాజు, పెరుగు లింగయ్య, పాండురంగ చారి ,జక్కలి గోపి, తగుల జనార్ధన్, బుడగ మల్లేష్ యాదవ్, పాషా పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు