Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంవ్యవసాయం

ఖమ్మం : వైయస్ షర్మిల పర్యటనలో అపశృతి, కింద పడిపోయిన షర్మిల (వీడియో) 

ఖమ్మం : వైయస్ షర్మిల పర్యటనలో అపశృతి, కింద పడిపోయిన షర్మిల (వీడియో) 

ఖమ్మం, మనసాక్షి :

ఖమ్మం జిల్లాలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు అపశృతి చోటు చేసుకుంది. ఆమె మీడియాతో మాట్లాడుతుండగా కింద పడిపోయిందివ ఈ సంఘటనతో కార్యకర్తలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.

ఖమ్మం జిల్లా వైరా నియోజక వర్గం కొణిజర్ల మండలంలో అకాల వర్షాలకు జరిగిన పంట నష్టాన్ని వైఎస్ షర్మిల పరిశీలించారు . మీడియాతో మాట్లాడుతున్న సమయంలో అస్వస్థతకు గురైన షర్మిల పొలంలోనే కింద పడిపోయారు.

ఆమె మీడియాతో మాట్లాడిన కామెంట్స్ యధావిధిగా: 

 

  • ఇటీవల కురిసిన వర్షానికి ఖమ్మం రైతులు దారుణంగా నష్టపోయారు.

  • అకాల వర్షాలకు చేతికొచ్చిన మొక్క జొన్న పంట నేల పాలయ్యింది.

  • ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 30 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది.

  • గత నెల ఇదే ఖమ్మం జిల్లాకి కేసీఅర్ వచ్చాడు.

  • మొక్క జొన్న పంటను పరిశీలించి 10 వేలు ఇస్తా అని ప్రకటన చేశాడు.

  • గాలి మోటార్లో వచ్చి గాలి మాటలు చెప్పాడు.

  •  ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదువ

  • పెద్ద పెద్ద భవంతులు కట్టేందుకు డబ్బులు ఉంటాయి.

  • పంట నష్టపోయిన రైతులకు ఇవ్వడానికి రూపాయి కూడా ఉండదు.

  •  2.50 లక్షల ఎకరాలు అని చెప్పి ఇప్పుడు లక్షా 50 వేల ఎకరాలు అన్నారు..అది కూడా లేదు.

  • బోడి 5 వేలు రైతు బందు ఎవడు అడిగాడు. 30 నుంచి 50 వేలు పెట్టుబడి పడితే నష్టపోయారు. 5 వేలు ఏ మూలకు సరిపోతాయి.

  •  ఇదేనా కేసీఅర్ పాలన

  • రాష్ట్రంలో ఇప్పటి వరకు 9.50 లక్షల ఎకరాల్లో నష్టం జరిగింది.

  • కనీసం ఒక్క ఎకరాకు పరిహారం ఇవ్వలేదు.

  • నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం వెంటనే ఇవ్వాలి

 

షర్మిల కింద పడిపోయిన వీడియో 👇

 

మరిన్ని వార్తలు