Ysr : రైతన్నకు వైయస్సార్ భరోసా.. ఖాతాల్లోకి రూ.7500..!

Ysr : రైతన్నకు వైయస్సార్ భరోసా.. ఖాతాల్లోకి రూ.7500..!

అమరావతి, మనసాక్షి :

రైతులకు పెట్టుబడి సాయం పంపిణీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏర్పాట్లు పూర్తి చేశారు.

 

రాష్ట్రంలోని 52 .31 లక్షల మంది రైతులకు 3923 కోట్ల రూపాయలను వైయస్సార్ భరోసా పథకం ద్వారా వారి వారి ఖాతాల్లోకి గురువారం జమ చేయనున్నారు. అదేవిధంగా 53.62 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీని కూడా అందించనున్నారు.

రైతులకు పెట్టుబడి సహాయంగా వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా రైతులకు ఒక్కొక్కరికి రూ.7500 చొప్పున వారి ఖాతాల్లో జమ కానున్నాయి.

 

Also Read : Aadhaar Card : ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి శుభవార్త..!

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహించే కార్యక్రమంలో బటన్ నొక్కి రైతు ఖాతాల్లో డబ్బులను జమ చేయనున్నారు.

 

వైఎస్ ఆర్ రైతు భరోసా పథకం ద్వారా ప్రతి సంవత్సరం మూడు విడతల్లో 13,500 రూపాయల చొప్పున పెట్టుబడి సహాయాన్ని అందిస్తున్నారు.

 

అర్హులైన భూ యజమానులతో పాటు దేవాదాయ, అటవీ భూముల సాగుదారులతో పాటు సెంటు కూడా భూమిలేని ఎస్సీ ,ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన కౌలు దారులకు మే నెలలో 7500 ,అక్టోబర్ లో 4వేల రూపాయలు, జనవరిలో 2000 రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరం జమ చేస్తున్నారు.

 

Also Read : Central scheme : కేంద్ర ప్రభుత్వ పథకం.. నెలకు రూ. 10 వేలు ఎవరైనా పొందొచ్చు

 

ఈ విధంగా 2019 -20 లో 6173 కోట్లు సహాయం అందించారు. 2020 – 21లో 6,928 కోట్ల సహాయం అందజేశారు. 2021 – 22 లో 7016 కోట్ల చొప్పున రైతులకు ఖాతాలో జమ చేశారు. కాగా 2023 -24 కు సంబంధించి తొలి విడతగా 3923 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేయనున్నారు.

 

అదే విధంగా ఈ సీజన్ లో పంట నష్టపోయిన రైతులకు పంట పరిహారంగా ఇన్ పుట్ సబ్సిడీ అందిస్తూ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుంది.

 

ఈ ఏడాది మార్చి , ఏప్రిల్ నెలలో కురిసిన అకాల వర్షాల వల్ల 78, 830 ఎకరాల్లో పంటలు నష్టపోగా 51, 468 మంది రైతులకు పంట నష్టం వాటిల్లింది. 53 .62 కోట్ల రూపాయలను ఇన్ పుట్ సబ్సిడీ ద్వారా రైతుల ఖాతాలలోకి నేరుగా జమ చేయనున్నారు.