వైయస్సార్ టిపి రాజకీయ కార్యచరణ కమిటీ సభ్యుడిగా పిట్ట రాంరెడ్డి

వైయస్సార్ టిపి రాజకీయ కార్యచరణ కమిటీ సభ్యుడిగా పిట్ట రాంరెడ్డి

హైదరాబాద్, మన సాక్షి : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాజకీయ కార్యాచరణ కమిటీ సభ్యుడిగా రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్ట రాంరెడ్డి ని పార్టీ అధినాయకురాలు వైయస్.షర్మిళమ్మ నియమించారు. పిట్ట రాంరెడ్డి వైయస్ఆర్ కుటుంబానికి మొదటినుంచి విధేయుడిగా ఉంటున్నాడు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్.రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో ఉన్నత విద్యను అభ్యసించడమే కాక పారిశ్రామికవేత్తగా ఐ.టి.రంగంలో ఉన్నత స్థాయిలో నిలబడ్డాడు. ఆ విధేయతే ప్రామాణికంగా వైయస్.షర్మిళమ్మ పార్టీ స్థాపించినది మొదలు ఆమెకు ముఖ్య అనుచరుడుగా నడుస్తూ పార్టీ రాష్ట అధికార ప్రతినిధిగా, సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ గా పార్టీ అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేస్తున్నాడు. అంతేకాక ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ అబ్జర్వర్ గా కూడా తన సేవలు అందిస్తున్నాడు. ఇటీవల జరిగిన వైయస్.షర్మిళమ్మ ప్రజాప్రస్థానపాదయాత్రలో కీలకమైన వ్యక్తిగా తను విశేష సేవలు అందించాడు.

పిట్ట రాంరెడ్డి వ్యక్తిగతంగా చాలా మృదుస్వభావి. తన దగ్గరకు వచ్చే వారిని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ, వారి సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించేవాడు.

ALSO READ : BREAKING : హుజూర్నగర్ లో కేటీఆర్ కు ఘన స్వాగతం

పార్టీ కార్యకర్తలతో, గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నాయకులతో కలసిమెలిసి వైయస్సార్ తెలంగాణ పార్టీ బలోపేతం కోసం, రానున్న రోజుల్లో పార్టీ అధికారంలోకి రావడం కోసం తనవంటిబాధ్యతగా ముందుకు నడుస్తున్నాడు. వైయస్. షర్మిళమ్మను తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా ముఖ్యమంత్రిగా చూడాలని, తెలంగాణలో రాజన్న సువర్ణ పరిపాలన తేవాలనే పట్టుదల వ్యక్తిగా రాజకీయ రంగంలో తనకంటూ ఒక స్థానం సాధించాలనే తపనతో, అకుంఠిత దీక్షతో ముందుకు సాగుతున్నాడు. ఎన్ని అవమానలొచ్చినా , ఎన్ని ఇబ్బందులు ఎదురైని తన లక్షసాధనలో ముందుకు సాగుతున్న పిట్ట రాంరెడ్డి కి వైయస్సార్ తెలంగాణ పార్టీ రాజకీయ కార్యాచరణ కమిటీలో సభ్యునిగా నియమించినందుకు పార్టీ అధినాయకురాలు వైయస్.షర్మిళమ్మ కి కృతజ్ఞతలు తెలుపుతూ తనకిచ్చిన ఈ బాధ్యతనుకూ సక్రమంగా నిర్వహించి, పార్టీ విజయంకోసం పనిచేస్తానని ఆయన ఒక ప్రకటనలో తెలియజేశారు..

ALSO READ : హుజూర్ నగర్ లో మంత్రుల పర్యటన – latest news

ఇంతవరకు తనకు సహకరిస్తున్న పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తాను ఎంతో ఋణపడి ఉంటానని ఆయన తెలియజేశారు.