హుజూర్ నగర్ లో మంత్రుల పర్యటన – latest news

హుజూర్ నగర్ లో మంత్రుల పర్యటన

ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు

హుజూర్ నగర్ , మన సాక్షి : ఉమ్మడి నల్గొండ జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలోని
హుజూర్ నగర్ పట్టణంలో కొత్తగా నిర్మించిన ఈఎస్ఐ ఆసుపత్రిని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీ సైదిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : BREAKING : హుజూర్నగర్ లో కేటీఆర్ కు ఘన స్వాగతం

నిర్మాణ పనులు ప్రారంభం

హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో నిర్మించే 4 వంతెనలు, రింగ్ రోడ్డు, రహదారులు మరియు బస్తీ దవాఖానల పనులను మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, స్థానిక శాసనసభ్యులు సైదిరెడ్డి , ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కరరావు ,బొల్లం మల్లయ్య యాదవ్ తదితరులు  పాల్గొన్నారు.