108 వాహనంలో మహిళ ప్రసవం.. తల్లి బిడ్డ క్షేమం, సిబ్బందికి ప్రశంసలు..!

పురిటినొప్పుల‌తో ఉన్న గ‌ర్భిణిని ద‌వాఖాన‌కు త‌ర‌లిస్తుండ‌గా, 108 వాహ‌నంలోనే ప్ర‌స‌వించింది. 108 సిబ్బంది ఆమెకు ప్ర‌స‌వం చేసి..త‌ల్లీ, బిడ్డ‌ల‌ను కాపాడారు

108 వాహనంలో మహిళ ప్రసవం.. తల్లి బిడ్డ క్షేమం, సిబ్బందికి ప్రశంసలు..!

అందోలు, మనసాక్షి :

పురిటినొప్పుల‌తో ఉన్న గ‌ర్భిణిని ద‌వాఖాన‌కు త‌ర‌లిస్తుండ‌గా, 108 వాహ‌నంలోనే ప్ర‌స‌వించింది. 108 సిబ్బంది ఆమెకు ప్ర‌స‌వం చేసి..త‌ల్లీ, బిడ్డ‌ల‌ను కాపాడారు.

ఈ ఘటన గురువారం మధ్యాహ్నం హత్నూర మండలం కాసాల గ్రామానికి చెందిన మంజుల అనే మహిళ పురిటి నొప్పులతో బాధపడుతూ 108 వాహనానికి సమాచారం అందించారు. వెంటనే వాహనం గ్రామానికి వెళ్లి మంజులను డెలివరీ నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు వాహనంలో తీసుకువస్తున్న క్రమంలో మార్గమధ్యలోకి రాగానే నొప్పులు ఎక్కువ కావడంతో వాహనంలోనే సిబ్బంది డెలివరీ చేశారు.

దీంతో ఆడబిడ్డ జన్మించింది. తల్లి బిడ్డలను జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 108 వాహనం ఈ ఆర్ సిపి డాక్టర్ హబీబ్, ఈఎంటి ఎం శ్రీనివాస్, పైలట్ కృష్ణమూర్తిలను మహిళ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సకాలంలో వైద్యం చేయడంతో తల్లి బిడ్డలకు ప్రాణాపాయం తప్పిందని 108 సిబ్బంది తెలిపారు.

ALSO READ

Aadhaar : మీ ఆధార్ కార్డులో ఉన్న ఫోటో మీకు నచ్చలేదా..? అయితే ఇలా మార్చేయండి..!

Whatsapp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. ఇక మీ ఫ్రెండ్స్ స్టేటస్ పెట్టగానే..!