24 గంటల్లో కేసు చేధించిన పోలీసులు
24 గంటల్లో కేసు చేధించిన పోలీసులు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, మనసాక్షి :
24 గంటల్లో కేసు చేదించినందుకుగాను మల్కాజిగిరి సీఐ రవికుమార్ ను ప్రత్యేకంగా అభినందించిన కమిషనర్ దేవేందర్ సింగ్ చౌహన్. మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మిర్యాలగూడ ప్రాంతంలో నివసించే 65 సంవత్సరాల వయసు గల ఎలిజిబెత్ అనే వృద్ద మహిళ మెడలో నుండి బలవంతంగా చైన్ లాక్కుపోయినట్లు బాధితురాలు రెండు రోజుల క్రితం మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆమె ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులకు వెహికల్ చెకింగ్ లో నిందితులు పట్టుబడ్డరూ. దొరికిన వారిలో ఒకరు 20 సంవత్సరాల దినేష్, ఇంకొక మైనర్ బాలుడు ఉన్నట్లు శనివారం నేరేడ్ మెట్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ దేవేందర్ సింగ్ చౌహన్ తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ దినేష్ పాత నేరస్తుడు ఇతను సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పలు చైన్ చ్నాచింగ్ కేసులలో నిందితుడని అన్నారు. వారి వద్ద నుండి 10 గ్రాముల బంగారం చైన్ ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అనంతరం 24 గంటల్లో కేసు చేదించినందుకుగాను మల్కాజిగిరి సీఐ రవికుమార్ ను ప్రత్యేకంగా అభినందించిన కమిషనర్ దేవేందర్ సింగ్ చౌహన్.









