25 Years : 25 ఏళ్లుగా ఉద్యోగాల కోసం వారి పోరాటం… !

25 Years : 25 ఏళ్లుగా ఉద్యోగాల కోసం వారి పోరాటం… !

సత్తుపల్లి, మన సాక్షి :

ప్రగతి భవన్ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీను అమలు చేయమంటూ వేడుకుంటున్న 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ ఉమ్మడి ఖమ్మం జిల్లా అభ్యర్థులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1998 డీఎస్సీలో అర్హత పొంది ఉద్యోగం రాక దగా పడ్డ తెలంగాణ అభ్యర్థులం అంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

సత్తుపల్లి పట్టణ పరిధిలోని కళాభారతిలో 1998 డిఎస్సీ క్వాలిఫైడ్ ఉమ్మడి ఖమ్మం జిల్లా అభ్యర్థులు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ నాడు ఖమ్మం జిల్లాలో మొదటి లిస్టు నియామకంలో నోటిఫికేషన్ ప్రకారం జిల్లా మొత్తం యూనిట్గా తీసుకొని ఉద్యోగాలు ఇచ్చారు.

 

ALSO READ : Gruhalaxmi : సొంత స్థలం ఉంటే తెలంగాణ గృహలక్ష్మి పథకం.. రూ. 3 లక్షలు ఇలా పొందండి..!

 

రెండో లిస్ట్ పెట్టే సమయానికి జీవో నెంబర్ 3 అమలు చేస్తూ ఖాళీగా ఉన్న పోస్టులను మాకు ఇవ్వకుండా బ్యాక్లాగ్ చేశారని, ఉప ఎన్నికల పేరుతో ఖమ్మం,కరీంనగర్,నల్గొండ,వరంగల్ జిల్లాలో అర్హత పొందిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వకుండా అన్యాయం చేశారని ఆవేదనకు లోనయ్యారు.

 

ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రగతి భవన్ సాక్షిగా 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లోని డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు
కదలక వచ్చి అక్కడి ప్రభుత్వాన్ని విన్నవించగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించి..

 

ALSO READ : Phonepe : ఫోన్ పే లో ఉద్యోగాల భర్తీ .. ఏదైనా డిగ్రీ ఉంటే చాలు.. రూ. 35 వేల జీతం..!

 

ఎంటిఎస్ పద్ధతిలో సుమారు 6000 మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చారని, తెలంగాణలో హామీ ఇస్తే ఆంధ్ర అభ్యర్థులకు న్యాయం జరిగిందని అన్నారు.ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అందరూ సంతోషంగా ఉన్నారని,

 

ALSO READ : RBI : రూ. 500 నోట్లపై ఆర్ బీ ఐ కీలక ప్రకటన..!

 

1998 డీఎస్సీ క్వాలిఫై అయినా మేము మా ఉద్యోగ నియామక పత్రం ఎప్పుడు ఇంటికి వస్తుందా అని ఎదురుచూస్తూ ఆశలతో బ్రతుకుతున్నామని ఇకనైనా ముఖ్యమంత్రి కెసిఆర్ స్పందిస్తూ ఎంటిఎస్ పద్ధతిలో ఉద్యోగ అవకాశం కల్పించాలని వేడుకున్నారు.