Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణమంచిర్యాల జిల్లా

Laxettipet : లక్షెట్టిపేటలో.. 30 బైకులు, రెండు ఆటోలు స్వాధీనం..!

Laxettipet : లక్షెట్టిపేటలో.. 30 బైకులు, రెండు ఆటోలు స్వాధీనం..!

లక్షేట్టిపేట్, (మన సాక్షి);

లక్షెట్టిపేట పట్టణంలోని గోదావరిరోడ్డు వీకర్ సేక్షన్ కాలనిలో శుక్రవారం రోజున ఉదయం పోలీసుల కార్డాన్ సర్చ్ నిర్వహించారు. ఈసర్చ్ లో సుమారు 30 బైకులు, 2 ఆటోలను స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా సిఐ నరేందర్ మాట్లాడుతూ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా కార్డాన్ సర్చ్ నిర్వహిచడం జరుగుతుందన్నారు.

యువత మత్తు పదార్థాలకు బానిస కాకూడదని, వాటికి బానికై జీవితాన్ని నాశనం చేసుకోకూడదన్నారు,కాలనీలో సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రతి వాహన దారుడు వాహనాల పత్రాలను వాహనంతో పాటు ఉంచుకోవాలని, రాష్ డ్రైవింగ్ చేస్తే చర్యలు తప్పవన్నారు. గంజాయి,డ్రగ్స్ లాంటివి అమ్మితే చాలా పెద్ద నేరమని వాటి జోలికి పోయి కేసుల్లో ఇరుక్కోకుడదని అవగాహన కల్పించారు. ఈకార్యక్రమంలో లక్షేట్టిపేట్ పట్టణ ఎస్సై సతీష్, రెండవ ఎస్ఐ తానాజీ తో పాటు పోలీస్ సిబ్బంది ఉన్నారు.

ALSO READ : 

Good News : ప్రయాణికులకు TGSRTC శుభవార్త.. ఇకపై తొలగనున్న కష్టాలు..!

Ktr, Somireddy : మీ కళ్ళకున్న పొరలు ఇంకా తొలగనట్టుంది.. కేటీఆర్ పై సోమిరెడ్డి ఫైర్..! 

మరిన్ని వార్తలు