సూర్యాపేట : 33 డేళ్ల స్నేహానికి.. అండగా నిలిచారు..!

సూర్యాపేట : 33 డేళ్ల స్నేహానికి.. అండగా నిలిచారు..!

మేళ్లచెరువు, మనసాక్షి:

సూర్యాపేట జిల్లా ఉమ్మడి మేళ్లచెరువు మండలంలోని దొండపాడు జడ్పీ హైస్కూల్ పూర్వ విద్యార్ది కుటుంబానికి స్నేహితులు ఆర్దికసాయం చేసి తమ ఉదారతను చాటుకున్నారు. 1990-91 బ్యాచ్ కి చెందిన విద్యార్ధులలో ఒకరైన బొడ్డు శ్రీనివాసరావు కొన్నాళ్ల క్రితం మృతి చెందటంతో వారి కుటుంబానికి 50 వేల రూపాయలను ఇచ్చి ఉదార స్వభావాన్ని చాటుకున్నారు.

 

తమ మద్య లేని స్నేహితుని కుటుంబానికి అండగా నిలబడ్డారు. స్కూల్ ఫర్నిచర్ కోసం 15 వేలు,గ్రామం లోని గ్రంధాలయానికి 10 వేలను అందజేశారు. కార్యక్రమం లో పూర్వ విద్యార్ధులు కందిబండ నరసింహారావు, విప్పర్ల శ్రీనివాస్, కన్న సాంబశివరావు, కొండా జయపాల్ రెడ్డి, మేకల రామారావు, చింతకాయల బ్రహ్మయ్య, పాతకుంట్ల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.