సూర్యాపేట : సిమెంట్ పరిశ్రమలో ప్రమాదం ఇద్దరు మృతి
సూర్యాపేట : సిమెంట్ పరిశ్రమలో ప్రమాదం ఇద్దరు మృతి
పరిశ్రమలో మృతి చెందిన కుటుంబాలను ఆదుకుంటాం
మఠంపల్లి , మన సాక్షి
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో గల గ్రే గోల్డ్ సిమెంట్ పరిశ్రమలో సోమవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. వివరాలకు వెళితే పరిశ్రమలో కొలిమి లో రా మెటీరియల్ జాము కావడంతో అక్కడే పని చేయుచున్న ముగ్గురు కార్మికులు దాన్ని క్లియర్ చేసినందుకు వెళ్లిగా అక్కడ జరిగిన అగ్ని ప్రమాదంలో మఠంపల్లికి చెందిన మునగపాటి సైదులు (45) అక్కడికక్కడే మృతి చెందగా, సాయి(24) అనే వ్యక్తి హుజూర్నగర్ హాస్పిటల్ నుండి మెరుగైన వైద్యం కోసం వేరే హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోవడం జరిగింది, మరో వ్యక్తి సైదులుకి(25) తీవ్రంగా గాయాలయ్యాయని అతనిని కోదాడ లోని ప్రయివేటు హాస్పిటల్ కు తరలించారు.
ఇదే పరిశ్రమలో గత మూడు నెలల క్రితం సైదులు అనే వ్యక్తి చనిపోవడం జరిగింది.కార్మికులకు సరైన రక్షణ కవచాలు లేకపోవడం వలన పలుమార్లు ప్రమాదాలు జరుగుతున్నాయని పరిశ్రమ యాజమాన్యం కార్మికులకు సరైన రక్షణ కవచాలు, ప్రమాదాలపై పూర్తి అవగాహన కల్పించిన దాఖలాలు లేకపోవడంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొంతకాలం క్రితమే ప్రమాదం జరిగి వ్యక్తి మృతి చెందినప్పటికీ యాజమాన్యం కార్మికుల రక్షణకై ఎలాంటి చర్యలు చేపట్టపోవడాన్ని గ్రామస్తులు యాజమాన్యం పై మండిపడుతు గ్రామస్తులు పరిశ్రమ ముందు ధర్నా కు దిగారు సంఘటన జరిగిన ప్రదేశాన్ని హుజుర్ నగర్ సిఐ రామలింగారెడ్డి సంఘటన జరిగిన విషయం తెలుసుకుని పరిశ్రమలో ని ఘటనను పరిశీలించారు.
యాజమాన్యం వారు గ్రామ పెద్దల సమక్షంలో జరిగిన సంఘటన పై కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ప్రమాదం లో మరణించిన కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడంతో బాటు వారి కుటుంబంలోని వారికి ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇవ్వగా వెంటనే గ్రామస్థులు కుటుంబ సభ్యులు ధర్నాను విరమించారు. మఠంపల్లి ఎస్ ఐ ఇరుగు రవి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.










