సంక్షేమ పథకాలతో పేదలకు బిఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుంది: ఎమ్మెల్యే భాస్కర్ రావు
మిర్యాలగూడ టౌన్( దామరచర్ల), మన సాక్షి:
సంక్షేమ పథకాలతో పేదలకు బిఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు అన్నారు. గురువారం నియోజకవర్గంలో దామరచర్ల మండల కేంద్రం నందు గల రైతు వేదిక నందు తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టాత్మక పథకం అయిన కళ్యాణ లక్ష్మి & షాదిముబారక్ ద్వారా దామరచర్ల మండల వ్యాప్తంగా- 145 మందికి మంజూరైన 1 కోటి 45 లక్షల 16 వేల 820 రూపాయల విలువ గల చెక్కులను లబ్దిదారులకు అందజేసారు. అనంతరం వీర్లపాలెం గ్రామానికి చెందిన బి.ఆర్.ఎస్ కార్యకర్త రుపావత్ చందు ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదానికి గురి అయ్యి మృతి చెందారు. బి.ఆర్.ఎస్ పార్టీ సబ్యత్వం కలిగి ఉండడం వల్ల వారికీ మంజూరు అయిన బి.ఆర్.ఎస్ పార్టీ ప్రమాద భీమా 2 లక్షల రూపాయల చెక్కును వారి కుటుంబీకులకు అందజేసారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో కల్యాణలక్ష్మి పథకం కింద రూ.లక్ష 116 ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఆసరా పథకం ద్వారా వృద్ధులు, వితంతువులకు రూ.2,016/-, దివ్యాంగులకు రూ.3,016/- అందజేస్తున ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. సంక్షేమ పథకాలతో పేదలకు టీ.ఆర్.ఎస్ సర్కారు అండగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్.డి.ఓ చెన్నయ్య, డీసీఎంఎస్ జిల్లా వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణ రెడ్డి, జిల్లా రైతు బందు సమితి సభ్యులు కుందూరు వీరకోటి రెడ్డి, జడ్పీటీసీ లలిత-హతిరం, ఎంపీపీ ధీరావత్ నందిని-రవితేజ, మైనారిటీ నాయకులూ యూసుఫ్, మండల కో ఆప్షన్ సభ్యులు నాగుల్ మీరా, దామరచర్ల మండల ప్రధాన కార్యదర్శి దారగని వెంకటేశ్వర్లు, పడిగాపాటి పెద కోటిరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచ్లు, ఎం.పీ.టీ.సీ లు, ఉప సర్పంచ్లు, వార్డ్ మెంబర్లు, గ్రామ పార్టీ అద్యక్షులు తదితరులు పాల్గొన్నారు…










