లక్షేట్టిపేట్ : రెచ్చిపోతున్న దొంగలు
లక్షేట్టిపేట్ : రెచ్చిపోతున్న దొంగలు
లక్షేట్టిపేట్ , (మన సాక్షి);
పట్టణంలోని పలు చోట్ల పట్టపగలే చోరీలకు పాల్పడుతూ దొంగలు రెచ్చిపోతున్నారు. వారాల వ్యవధిలోనే అనేక సార్లు దొంగతనాలు చేస్తూ ఇటు ప్రజలకు అటు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. పోలీసులకు క్లూస్ దొరకకుండా జాగ్రత్తలు తీసుకుంటూ మరోవైపు పట్టపగలే చోరీలతో ప్రజలను బేంబేలెత్తిస్తున్నారు.
తాజాగా మంగళవారం పట్టపగలు స్థానిక కోర్టు ఏరియా లోని మస్తాన్ గూడా లోని తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనం చేశారు. అనంతరం గంటల వ్యవధిలో రాం నగర్ గోదావరి రోడ్ కు చెందిన ఓ వ్యక్తి ఇంటి వెనుక వైపు గల తలుపులు తెరిచి దొంగతనం చేయడం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది.
కాగా, ఇటీవల దొంగలు రెచ్చిపోవడంతో పోలీసులు ఆయా కాలనీ వాసులకు సీసీ కెమెరా లు తమ కాలనీల్లో, ఇండ్లలో ఏర్పాటు చేసుకోవాలని సలహాలు ఇవ్వడంతో కాలనీ వాసులు సీసీ కెమెరా ల కోసం చందా డబ్బులు జమ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.









