Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

రోడ్ విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయాలి – నారాయణపేట ఆదనపు కలెక్టర్ మాయంక్ మిత్తల్

రోడ్ విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయాలి

ఆదనపు కలెక్టర్ మాయంక్ మిత్తల్

నారాయణపేట,  మన సాక్షి:

నారాయణపేట జిల్లా లో గురువారం మధ్యాహ్నం కలెక్టరేట్ వీడియో కాన్ఫెరెన్స్ హాల్ లో నారాయణపేట మున్సిపాలిటీ అధికారులతో అదనపు కలెక్టర్ రోడ్డు విస్తరణ పనులు జాప్యం లేకుండా త్వరగా పూర్తి చేయాలన్నారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుంచి వీర సావర్కర్ చౌరస్తా వరకు ఖర్చు తో సుందరికారణ లో భాగంగా చేపట్టిన విస్తరణ పనులను వేగవంతం చేయాలన్నారు.

 

ఇరువైపులా వాకింగ్ ట్రాక్ మురగుకాల్వల ఏర్పాటు పనులలో వేగవంతం చేయాలన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా పనులు పూర్తి చేయాలన్నారు. అలాగే ఆస్థి పన్ను, వాణిజ్య పన్ను లు వసూలూ చేయలన్నారు.

 

ఐ.డి.ఎస్.ఎమ్.టి. బకాయిలను వాసులు చేయాలనీ ఆదేశించారు. ప్రతి ఇంటి కి డిజిటల్ నెంరింగ్ నమోదు చేయాలన్నారు. అలాగే జిల్లా కేంద్రం లో జరుగుతున్న పలు అభిరుద్ది కార్యక్రమాలను వేగవంతం చేయాలన్నారు. జిల్లా కేంద్రం లో అక్రమ కట్టడాలు ఉంటే వెంటనే తొలగించాలన్నారు.
ఈ సమావేశం లో మున్సిపల్ కమిషనర్ సునీత, మున్సిపల్ ఏఈ‌ మహేష్, యూసుఫ్, అజీం, రవితేజ, చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు