Breaking NewsTOP STORIESక్రైంతెలంగాణరంగారెడ్డిహైదరాబాద్
హైదరాబాద్ శివారులో గ్యాంగ్ వార్..?
హైదరాబాద్ శివారులో గ్యాంగ్ వార్..?
ఆదివారం అర్ధరాత్రి దాటాక హల్ చల్
హైదరాబాద్, మనసాక్షి :
హైదరాబాద్ శివారు లో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు వర్గాల వారు గ్యాంగ్ వార్ నిర్వహించారు. శివారులోని నార్సింగి ప్రాంతంలో ఒక స్థలానికి సంబంధించి రెండు వర్గాల వారు నాదంటే… నా అంటూ బాహబాహీ కి దిగారు. ఒక వర్గం వారు కంటైనర్ తెచ్చిపెట్టి అక్కడే కూర్చున్నట్లు తెలిసింది.
కాగా మరో వర్గం వారు కూడా స్థలం వద్దకు వచ్చి ఆ స్థలం తమదే అంటూ బాహా బాహీకి దిగి ఆ తర్వాత వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. కంటైనర్ తో వచ్చిన గ్యాంగ్ మాత్రం అక్కడి నుంచి కదలకుండా ఉన్నట్లు తెలుస్తుంది. ఆ సమయంలో పోలీస్ కంట్రోల్ రూమ్ కూడా ఒక వర్గం వారు ఫోన్ చేసినట్లు సమాచారం.
కోట్ల రూపాయల విలువైన ఆ స్థలాన్ని రెండు వర్గాల వారు దక్కించుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం.









