Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి
యువకుడి అదృశ్యం : కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
యువకుడి అదృశ్యం : కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, మనసాక్షి
జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్లారెడ్డి గూడ యువకుడు అదృశ్యం. జవహర్ నగర్ సిఐ సీతారాం తెలిపిన వివరాల ప్రకారం జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డి గూడ లో కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్న అల్లం బుచ్చయ్య. అతని కుమారుడు వయస్సు 25 ప్రవేట్ ఉద్యోగం చేస్తూ ఉండేవాడు.
తెలిసిన వారి వద్ద డబ్బులు తీసుకుని గత నెల 25 న ఎవరికి చెప్పకుండా ఇంటి నుండి వెళ్లిపోయి ఇంతవరకు తిరిగి రాలేదు. అతని కోసం బంధువులు, తెలిసిన వారి వద్ద వెతికిన సమాచారం లభించలేదని అతని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ ఒక ప్రకటన ద్వారా మీడియాకు తెలియజేశారు.









