Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంసూర్యాపేట జిల్లా

సూర్యాపేట : కాంగ్రెస్ పాదయాత్రకు బ్రహ్మరథం –  పటేల్ రమేష్ రెడ్డి

సూర్యాపేట : కాంగ్రెస్ పాదయాత్రకు బ్రహ్మరథం 

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి

సూర్యాపేట మార్చి 11 మనసాక్షి

సూర్యాపేట నియోజకవర్గములో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి అన్నారు.

23 వ రోజు చేపట్టిన పాదయాత్ర ను చివ్వేంల మండలం అక్కలిదేవి గూడెం నుండి బండమీది చందుపట్ల గ్రామం చేరుకుంది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
భూమికోసం, ప్రజల విముక్తి కోసం పోరాడిన కమ్యూనిస్టు యోధులు దేవులపల్లి వెంకటేశ్వర్ రావు జన్మనిచ్చిన గ్రామ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తునన్నారు.

పోరాట యోధుల స్ఫూర్తితో ప్రజా వ్యతిరేక పాలకులు ఆయన మోడీ ,కె సి ఆర్ ల ఆగడాలను ఎండగట్టడానికి రాహుల్ గాంధీ చేస్తున్న పోరాట స్ఫూర్తితో నే
సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేస్తున్నామన్నారు.

.
తెలంగాణ సెంటిమెంటుతో సూర్యాపేట నియోజకవర్గ లో రెండుసార్లు గెలిచిన జగదీశ్వర్ రెడ్డి ఏనాడైనా ప్రజల సమస్యల పరిష్కారం కోసం గ్రామాలకు విచ్చేశాడా అని ప్రశ్నించారు.సూర్యాపేట నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం మా ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి పోరాడుతాం అన్నారు.

మరిన్ని వార్తలు