లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్ట్ ఎందుకు చేయడం లేదు..? – మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్
లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్ట్ ఎందుకు చేయడం లేదు..? – మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్
సూర్యాపేట మార్చి 13 మనసాక్షి
లిక్కర్ స్కామ్ లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయకుండా జాప్యం చేస్తూ బి జె పి ,బి ఆర్ ఎస్ పార్టీలు దొంగ నాటకాలు అడుతున్నాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ,మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆరోపించారు.
సోమవారం సూర్యపేట జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డితో కలిసి మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జొడో యాత్రకు వస్తున్న ఆదరణను చూసి బీజేపీ ,బి ఆర్ ఎస్ పార్టీలు లిక్కర్ స్కామ్ పేరుతో ప్రజల దృష్టిని రేవంత్ పాదయాత్ర నుండి మళ్లించేందుకే నాటకాలు అడుతున్నారన్నారు. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన పిళ్లే పక్క సమాచారం ఇచ్చిన కవిత ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు.
బి జె పి నాయకుల కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను అరెస్ట్ చేసి నిజాలు నిగ్గుతేల్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్రములోని కాంగ్రెస్ పార్టీ నాయకులు నడవగలిగే శక్తి వున్నవారు ఎవరైనా పాదయాత్ర చేయవచ్చన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్టే చేబట్టబోయే కార్యక్రమాలను గడపగడపకు తీసుకుని వెళ్లి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై చైతన్యం చేయాలని పార్టీ అధిష్టానం ఆదేశించిందని అన్నారు. బిజెపి, బిఆర్ ఎస్ మద్య అవగాహన వుందని, అందుకే కెసిఆర్ ప్రభుత్వ అవినీతి పై చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చకిలం రాజేశ్వరరావు , అంజద్ అలీ , కక్కిరెని శ్రీనివాస్ ,బైరు శైలేందర్ గౌడ్ , కుమ్మరికుంట్ల వేణు , పొలగాని బాలు గౌడ్ , కె శేఖర్ ,నరేందర్ నాయుడు ,తదితరులు పాల్గొన్నారు









