Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESతెలంగాణవిద్యసూర్యాపేట జిల్లా

సూర్యాపేట : గురుకుల విద్యార్థులకు కుళ్ళిపోయిన పండ్లు, విద్యార్థి సంఘాల ధర్నా

సూర్యాపేట : హాస్టల్ విద్యార్థులకు కుళ్ళిపోయిన పండ్లు, విద్యార్థి సంఘాల ధర్నా

సూర్యాపేట, మనసాక్షి

సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో నాణ్యత లేని కుళ్ళిపోయిన పండ్లును పంపిణీ చేసి, అస్యభంగా మాట్లాడతున్న కాంట్రాక్టర్ , అధికార పార్టీ నాయకుడు కొణితం శ్రీనివాస్ రెడ్డి లైసెన్సును రద్దు చేయాలని పి డి ఎస్ యు ఆధ్వర్యంలో పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా పి డి ఎస్ యు సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పోలేబోయిన కిరణ్ మాటలాతూ కాంట్రాక్టర్ ని నాణ్యమైన పండ్లు ను పంపిణి చేయమని మాట్లాడితే మేము అధికార పార్టీ నాయకుడిని మమ్మల్ని మీరు ఏమి చేయలేరు.

 

మీకు దమ్ముంటే మంత్రి, దగ్గర, కలెక్టర్ దగ్గర ధర్నా చేసుకో అని దురుసుగా మాట్లాడుతూ నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంట అని అంటూ మాట్లాడతున్న కొణితం శ్రీనివాస్ రెడ్డి లెస్సేన్ రద్దు చేయాలి అని అన్నారు. విద్యార్థులకు ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంటే జిల్లా లో ఉన్న కొంత మంది అధికార పార్టీ నాయకులను దగ్గర చేసుకొని కాంట్రాక్టర్ గా కొనసాగుతూ పేద బడుగు బలహీన వర్గ విద్యార్థులకు నాణ్యమైన పండ్లలను పంపిణి చేయకుండా కక్కుర్తి పడి దోచుకుంటున్న అధికార పార్టీ కాంట్రాక్టర్ల లైసెన్సు రద్దు చేయకపోతే పేద బడుగు బలహీన విద్యార్థులకు నాణ్యమైన ఆహారము అందదని అన్నారు.

 

తక్షణమే జిల్లా మంత్రి, కలెక్టర్, ఆర్ సి ఓ డిసి ఓ చొరవ తీసుకొని తన లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.. లేని యెడలలో ఆందోళన కార్యక్రమాలు చెప్పడతామని అని అన్నారు. ఈ ధర్నా లో పి డి ఎస్ యు డివిజన్ అధ్యక్షులు జలగం సుమంత్, డివిజన్ నాయకులు చిత్తలూరి గోపి, వేణు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు