సూర్యాపేట : తెలంగాణ ను ప్రపంచానికి పరిచయం చేసిన యోధుడు బి ఎన్ రెడ్డి – మంత్రి జగదీశ్ రెడ్డి
సూర్యాపేట : తెలంగాణ ను ప్రపంచానికి పరిచయం చేసిన యోధుడు బి ఎన్ రెడ్డి – మంత్రి జగదీశ్ రెడ్డి
బీ.ఎన్ చిరకాల వాంఛ ను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే
బీ.ఎన్ జీవితం నేటి తరానికి ఆదర్శం, స్పూర్తి వంతం
ప్రాజెక్టు లకు బీ. ఎన్ పేరు నామకరణ విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళతా
ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి
బీ .ఎన్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి
సూర్యాపేట, మనసాక్షి
తెలంగాణ ను ప్రపంచానికి పరిచయం చేసిన యోధుడు బీ.ఎన్ రెడ్డి అని సూర్యాపేట శాసనసభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కొనియాడారు. సూర్యాపేట నియోజకవర్గం ఆత్మకూర్ ఎస్ మండలం దాచారం గ్రామం లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, మాజీ పార్లమెంట్ సభ్యులు బీమిరెడ్డి నర్సింహ రెడ్డి శతదినోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి తుమ్మల పెన్ పహాడ్ ఎక్స్ రోడ్ లో బీ.ఎన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం దాచారం గ్రామం లో బీ. ఎన్ స్మారక గ్రంథాలయాన్ని ప్రారంభించిన మంత్రి సభ లో మాట్లాడుతూ ….
తెలంగాణ సమాజం స్వేచ్చ గా ఉందంటే దానికి కారణం బీ.ఎన్ పోరాట ఫలితమే అని అన్నారు.వితంతువును వివాహమాడిన ఆదర్శమూర్తి భీమిరెడ్డి నర్సింహారెడ్డి అన్నారు. అంతా అభిమానంతో బీఎన్‌గా పిలుచుకునే భీమిరెడ్డి నర్సింహారెడ్డికి తెలంగాణ చరిత్రలో ప్రత్యేక పుట ఉందని గుర్తు చేశారు. విసునూరు దేశ్‌ముఖ్ రామచంద్రా రెడ్టికి వ్యతిరేకంగా చాకలి ఐలమ్మకు ధన్నుగా నిలిచి తెలంగాణ సాయుధ పోరాటాన్ని ప్రపంచానికి తెలిసే విధంగా మలుపు తిప్పిన వ్యూహకర్త బీ. ఎన్ రెడ్డి అన్నారు.
బీ.ఎన్ జీవితం నేటి తరానికి ఆదర్శం, స్పూర్తి వంతం అన్నారు . రాజకీయంగా విభేదించినా, బీ.ఎన్ ను అభిమానించే లక్షలాది మంది లో నేను ఒకడిని అని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.బీ.ఎన్ స్పూర్తి తోనే తాను రాజకీయాల లోకి వచ్చానన్నారు. తుంగతుర్తి , సూర్యాపేట ప్రాంతాలకు గోదావరి జలాల ను తీసుకు రావాలనే బీ.ఎన్ చిరకాల వాంఛ ను నేరవెర్చిన ఖ్యాతి ఘనత, ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదే అన్నారు.
ఆంధ్ర కమ్యూనిస్ట్ నాయకుల మోసానికి బలైన నాయకుడు బీ.ఎన్ అన్నారు.ఆయన ఇచ్చిన చైతన్యం తోనే దేశం లో అన్ని చోట్లా కుల, మత వివాదాలు ఉన్నా, తెలంగాణ లో లేవన్నారు.బీ.ఎన్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలు చిరస్మరణీయం అని మంత్రి అన్నారు.బీ.ఎన్ కన్న కలల ను ముఖ్యమంత్రి కేసీఆర్ నిజం చేస్తున్నారని అన్నారు. బీ.ఎన్ స్పూర్తి తో తెలంగాణ లో ఆకలి కేకలు మటుమాయం అన్నారు. ప్రాజెక్టు లకు బీ.ఎన్ పేరు నామకరణం చేసే విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెలుతానని మంత్రి అన్నారు.
కార్యక్రమం లో పాల్గొన్న జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపాగాని వెంకట్ నారాయణ గౌడ్, గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆత్మకూర్ యస్ మండల ఎంపిపి స్వర్ణలత చంద్రారెడ్డి, పీఏసిఎస్ చైర్మన్ కొనతం సత్యనారయణ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు తూడి నర్సింహ రావ్, ప్రధాన కార్యదర్శి బత్తుల ప్రసాద్, మాజీ ఎంపిపి బ్రహ్మం, శిల్పి శ్రీనివాస్ రెడ్డి, బీ .ఎన్ కుమారుడు ప్రభాకర్ రెడ్డి, మేనళ్లులు , మండల సర్పంచ్ లు, ఎంపిటిసి లు,ప్రజా ప్రతినిదులు పాల్గొన్నారు.










