Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణయాదాద్రి భువనగిరి జిల్లాసామాజిక సేవ

వృద్ధులకు చేయూతను అందించిన హెల్ప్ ఏజ్ ఇండియా సేవ సంస్థ

వృద్ధులకు చేయూతను అందించిన హెల్ప్ ఏజ్ ఇండియా సేవ సంస్థ

చౌటుప్పల్ , మన సాక్షి.

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని చిన్న కొండూరు గ్రామంలో ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ హెల్పేజ్ ఇండియా ఆధ్వర్యంలో వృద్ధులకు 37చేతి కర్రలు, 1 ట్రైపాడ్ ,3 వాకర్స్ మరియు 2 వీల్ చైర్స్ మొత్తం 43 ఐటమ్స్ ఇవ్వడం జరిగినది.

 

ఈ కార్యక్రమమునకు గ్రామ సర్పంచ్ బక్క స్వప్న ముఖ్యఅతిథిగా హాజరై వారి చేతుల మీదుగా వృద్ధులకు బుధవారం అందజేశారు, తిగుళ్ల చంద్రయ్య ఉప సర్పంచ్, మండల వృద్ధుల సమాఖ్య మిర్యాల అంజయ్య, చెరకు ఆడవయ్య , వి ఎల్ ఎఫ్ ప్రెసిడెంట్ గర్శే భద్రం, ఎంఎల్ ఎఫ్ నెంబరు నెల్లే శంకరమ్మ,చిన్న కొండూరు వాలంటీర్లు,గ్రామపెద్దలు కృతజ్ఞతలు తెలియజేసినారు.

 

హెల్పేజ్ ఇండియాకి , హెల్పేజ్ ఇండియా ప్రాజెక్టు ఆఫీసర్ టి.షడ్రక్ మాట్లాడుతూ హెల్పేజ్ ఇండియా వృద్ధుల సంఘాలకు డిజేబుల్ డివైస్ డిస్ట్రిబ్యూషన్ చేయటం చాలా ఆనందాన్నిచ్చిందన్నారు . హెల్పేజ్ ఇండియా వృద్ధుల కోసం పని పనిచేస్తుంది తెలియజేసినారు. ఈ కార్యక్రమములు అన్నియు ఎతేంద్ర యాదవ్, హెల్పేజ్ ఇండియా స్టేట్ ఎడ్ ఆంధ్ర ప్రదేశ్ ,తెలంగాణ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయని తెలిపారు.

మరిన్ని వార్తలు