వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే – కత్తి కార్తిక
వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే – కత్తి కార్తిక
కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే పేదలకు న్యాయం
కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు ‘ కత్తి ‘
దుబ్బాక, మనసాక్షి : తెలంగాణ రాష్ట్రంలోవచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, ఇందిరమ్మ రాజ్యంతోనే కులవృత్తుల, పేదల ప్రజల బ్రతుకులు మారుతాయని కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తిక గౌడ్ అన్నారు. గురువారం హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా మెదక్ జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గం లో అందే గ్రామంలో మహిళలతో కలిసి మాట్లాడారు…
తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ అధికారంలోకి వచ్చి నాది నుండిఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చలేదని విమర్శించారు. ఎన్నికల ముందు ఇంటికి ఉద్యోగం ఇస్తానని ఎంతమందికి ఉద్యోగం ఇచ్చావో చెప్పాలని, నిరుద్యోగ భృతి 3000 ఇస్తానని చెప్పి మాట మార్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని అన్నారు. గిరిజనులకు, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తానని, దళితులకు మూడెకరాల సాగుభూమి ఇస్తానని అబద్దాలు చెప్పి గద్దెక్కిన కేసీఆర్ ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. కెసిఆర్ ప్రభుత్వంలోమహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధిమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేరైతులకు రెండు లక్షల రుణమాఫీ, ప్రతి ఆడ బిడ్డకు ఇంటి వంటగ్యాస్ 500 కి సిలిండర్ అని, నూతనంగా ఇల్లు నిర్మించుకున్నట్లయితే ఇందిరమ్మ ఇంటికి ఐదు లక్షల సహాయం, ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉంటే 5 కనీసం పెన్షన్ అందిస్తామని, అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనిరెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.
అందరి చూపు కాంగ్రెస్ వైపే ఉందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే కులవృత్తులకు, పేద ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులుకొత్త దేవి రెడ్డి, చందు, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.









