శిష్య పాఠశాలలో ఘనంగా ఉగాది సంబరాలు
శిష్య పాఠశాలలో ఘనంగా ఉగాది సంబరాలు
మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:
మిర్యాలగూడ పట్టణంలో చైతన్య నగర్ లో గల శిష్య పాఠశాలలో మంగళవారం ఘనంగా ఉగాది సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శిష్య పాఠశాల చైర్మన్ అల్లుబెల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఉగాది పచ్చడి ప్రత్యేకత గురించి విద్యార్థులకు తెలియజేశారు.
బెల్లం తీపి ఆనందానికి, ఉప్పు జీవితంలో ఉల్లాసం, వేప పూత చేదు బాధను కలిగించే అనుభవాలను, చింతపండు పులుపు నేర్పుగా వివరించాలని, పచ్చి మామిడి ముక్కలు, కారం కొత్త సవాళ్లను స్వీకరించి అద్భుతంగా ఉగాది పచ్చడి తయారు చేయాలని పిల్లలకు వివరించారు. అలాగే జీవితంలో సుఖాలను ఒకేలాగా స్వీకరించాలని పిల్లలకు వివరించారు
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అంజయ్య చారి, నాగరాజు, రమేష్, వసంత, లక్ష్మి, పద్మావతి, భాగ్యరేఖ, స్వాతిప్రియ, ధనలక్ష్మి, భవాని, లక్ష్మీ, అక్షిత ,నాగమణి ,అజీమా ,విద్యార్థిని ,విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.










