రైతులకు అండగా సహకార సంఘాలు – ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
రైతులకు అండగా సహకార సంఘాలు
నడిగూడెం, మన సాక్షి :
సహకార సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని కోదాడ అభివృద్ధి ప్రధాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం నడిగూడెం మండలం వల్లాపురం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాముకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం నడిగూడెం ఆధ్వర్యంలో నిర్వహించిన మహాజన సభలో ఆయన మాట్లాడాతూ గత ప్రభుత్వాల హయాంలో సహకార సంఘాలు నిర్వీర్యమై ఉన్నాయన్నారు.
బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సహకార సంఘాలను చైతన్యపరిచి అనేక రకాలుగా అభివృద్ధి చేశామన్నారు. సహకార సంఘాల ద్వారా రైతులకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలతో పాటు ఎరువులు పురుగుమందులు అందజేచేయడమే కాక రైతులు తమ పంటను నిల్వ చేసుకునేందుకు సహకార సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున లక్షల రూ.లు బడెజ్ట్ కేటాయిస్తున్నామని అన్నారు.ముఖ్య మంత్రి కేసీఆర్ కృషితో నేడు సహకార సంఘాలు రైతులకు అండగా నిలుస్తున్నా యన్నారు.
సహకార సంఘాలను వాణిజ్యపరంగా కూడా అభివృద్ధి చేస్తూ తెలంగాణ రాష్ట్రం దేశంలో ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రైతులు సహకార సంఘం సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం నడిగూడెం సహకార సంఘం ద్వారా వివిధ సబ్సిడీతో మంజూరైన కోటి రూపాయలు విలువగల రుణాలకు సంబంధించిన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో నడిగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పుట్ట రమేష్, ఎంపీపీ యాతాకుల జ్యోతి మధుబాబు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కాసాని వెంకటేశ్వర్లు, నాయకులు దేవబత్తిని సురేష్ ప్రసాద్ , బడేటి చంద్రయ్య, అనంతుల ఆంజనేయులు, సర్పంచుల పోరం అధ్యక్షులు వెంకట నరసయ్య, సర్పంచ్ వట్టికూటి చంద్రయ్య, వైస్ చైర్మన్ గూడపూరి రాములు,
డైరెక్టర్లు వట్టికూటి వెంకన్న, చిన్న కోటిరెడ్డి, ,సుధాకర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, పద్మ, దున్న రమాదేవి ,జయమ్మ, సోమ్లా, బొందయ్యా, కృష్ణ ప్రసాద్,నాయకులు పసుపులేటి జనార్ధన్, ఈదయ్య, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, సైదులు ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు నాయకులు, రైతులు,తదితరులు పాల్గొన్నారు









