Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి

రంగారెడ్డి జిల్లా : రోడ్డు ప్రమాదంలో బాలిక మృతి

రంగారెడ్డి జిల్లా : రోడ్డు ప్రమాదంలో బాలిక మృతి

ఆమనగల్లు ప్రతినిధి, మనసాక్షి:

రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణ సమీపంలోని కల్వకుర్తి రోడ్డులో పెద్ద బ్రిడ్జి వద్ద హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలిక తీవ్రంగా గాయపడింది.

వెల్దండ మండలం తుంకిబండ తండాకు చెందిన ఐశ్వర్య 12 తన పెదనాన్నతో కలిసి బైక్ పై ఆమనగల్లు కు కూరగాయలకు వస్తుంది.

 

పెద్ద పూలు వద్ద బైకు ఆగిపోవడంతో ఐశ్వర్య కిందకు దిగగా ఆమె పెదనాన్న బైక్ మరమత్తు చేస్తున్నాడు.ఈ క్రమంలో వెనక నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఇన్నోవా AP 10 AJ 9898 గల వాహనం ఐశ్వర్య ను ఢీకొంది.తీవ్రంగా గాయపడ్డ ఐశ్వర్య ను చికిత్స నిమిత్తం ఆమనగల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో వెల్డండ సమీపంలోని యెన్నం ఆసుపత్రికి తరలించారు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ సుందరయ్య తెలిపారు.

మరిన్ని వార్తలు