సూర్యాపేట : పోలీసు కుటుంబాలకు బాసటగా భద్రత పథకం
సిబ్బంది కుటుంబాలకు బాసటగా పోలీసు భద్రత పథకం
సూర్యాపేట జిల్లా ఎస్ పి రాజేంద్రప్రసాద్
సూర్యాపేట , మనసాక్షి :
సూర్యాపేట జిల్లా పరిదిలోని గరిడేపల్లి పోలీస్ స్టేషన్లో నందు ఏ ఎస్ ఐ గా విధులు నిర్వర్తిస్తూన్న జానకిరాములు ఇటీవల అనారోగ్యంతో ఆకాలంగా మృతి చెందారు. మృతి చెందిన జానకిరాములు కుటుంబ సభ్యులకు పోలీసు భద్రత ఇస్యూరెన్స్ స్కీం ద్వారా నగదు చెక్కును జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు శాఖలో పని చేస్తూ అకాల మరణం పొందిన సిబ్బంది కుటుంబాలను తెలంగాణ పోలీసు శాఖ అన్ని విధాలుగా అదుకుంటుందన్నారు. దివంగత సిబ్బంది కుటుంబాలకు పోలీసు భద్రత స్కీమ్ బాసటగా నిలుస్తుందని, జానకి రాములు కుటుంబం యొక్క సంక్షేమానికి కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏ ఓ సురేష్ బాబు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, జిల్లా పోలీసు సంఘం అధ్యక్షులు రామచందర్ గౌడ్, సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీకాంత్,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గ్రీవెన్స్ డే కార్యక్రమానికి 12 ఫిర్యాదులు:
ప్రజల సౌకర్యార్థం ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి 12 ఫిర్యాదులు వచ్చాయని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు.
ప్రతి ఫిర్యాదుదారునితో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు సత్వర భరోసా కల్పించాలని పిర్యాదులపై వేగంగా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.









