విద్యార్థులకు విలువలు నేర్పించాలి – డి.ఎస్.పి వెంకటగిరి
విద్యార్థులకు విలువలు నేర్పించాలి – డి.ఎస్.పి వెంకటగిరి
మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని బంగారుగడ్డలో గల కైరళి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యార్థులు వ్రాసిన లుసిడా చేతివ్రాత కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన డి.ఎస్.పి వెంకటగిరి మాట్లాడుతూ విద్యార్థులకు చదువులోనే కాకుండా, నీతి, విలువలు కూడా నేర్పించాలని ఉపాధ్యాయులకు తెలిపారు.
పాఠశాల చూస్తుంటే నా చిన్నతనం చదువుకున్న పాఠశాల జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని, విద్యార్థులు అందరూ కూడా చేతి వ్రాత అందంగా రాశారని, చేతిరాత అందంగా ఉన్నట్లయితే పేపర్ ప్రజెంటేషన్, పరీక్షలలో మార్కులు పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు.
లూసీడా చేతివ్రాత నేర్పించిన బ్రహ్మంని డి.ఎస్.పి వెంకటగిరి, టూ టౌన్ సిఐ నరసింహారావు లు ప్రత్యేకంగా అభినందించి, శాలువాతో సత్కరించారు.
సామాజికవేత్త మునీర్, కౌన్సిలర్ బాలు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఈ పాఠశాల వినూత్నమైన కార్యక్రమాలు నిర్వహిస్తుందని, పాఠశాలలోని విద్యార్థులందరూ కూడా బాగా చదువుతారని, అంకితభావంతో పనిచేసే టీచర్లు ఉన్నారన్నారు. ఈ చేతి వ్రాత పట్టణంలో ఏ పాఠశాలలో కూడా లేదని, ప్రత్యేకమైన దృష్టి పెట్టి పాఠశాల యాజమాన్యం పిల్లలందరితో చేతిరాతని అందంగా రాయటం అభినందనీయమన్నారు.
అనంతరం చేతిరాత అందంగా రాసిన విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికేట్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ అహమ్మద్, ప్రధానోపాధ్యాయురాలు వరలక్ష్మి, రాజేష్, రేణుక, భాష, మంజుల, రేష్మ, రాహుల్, విజయలక్ష్మి, యు. ఝాన్సీ, ప్రణీత, సబియా ఆఫ్రిన్, నాగలక్ష్మి, లావణ్య, నవీన, టి. ఝాన్సీ, రహీమున్నీసా, సంధ్య, రమాదేవి, ఆఫ్రిన్, మానస, ఇశ్రాత్, నజీర విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.









