రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
చింతపల్లి. మన సాక్షి
హైదరాబాద్ నాగార్జునసాగర్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన చింతపల్లి మండలంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం మండల పరిధిలోని అర్జనాపురం గ్రామానికి చెందిన పల్లెటి కుమార్ (34) శుక్రవారం తన భార్య శాంతమ్మ హైదరాబాదులో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతుంది.
దీంతో పల్లేటి కుమార్ తన భార్యను చూసేందుకు మోటర్ బైక్ పై బియ్యం వేసుకొని హైదరాబాద్కు ప్రయాణిస్తుండగా పోలేపల్లి రాంనగర్ గ్రామపంచాయతీ పరిధిలో గల మైసమ్మ గుడి సమీపంలోకి చేరుకోగానే హైదరాబాదు నుండి మల్లేపల్లి వైపు వెళ్తున్న ఓ కారు ఎదురుగా వస్తున్న మోటర్ బైకును ఢీకొట్టడంతో పల్లేటి కుమారుకు తీవ్రంగా గాయాలయ్యాయి.
కుమార్ బైక్ తీవ్ర రక్తస్రావం కావడంతో ఢీ కొట్టిన కారు యజమాని వెంటనే గమనించి వైద్య చికిత్స నిమిత్తం ఆ ఆ వ్యక్తిని హైదరాబాదుకు తరలించారు. దీంతో తలకు బలమైన గాయాలు కావడంతో చికిత్స పొందుతూపల్లెటి కుమార్ మృతి చెందాడు.
మృతునికి భార్య ఇద్దరు ఇరువురు కూతుర్లు ఒక కుమారుడు కలిగి ఉన్నట్టు సమాచారం. భార్య శాంతమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.









