Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంసూర్యాపేట జిల్లా

విభజన హామీలను నెరవేర్చని మోడీ కి రాష్ట్రానికి వచ్చే అర్హత లేదు

విభజన హామీలను నెరవేర్చని మోడీ కి రాష్ట్రానికి వచ్చే అర్హత లేదు

సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు

సూర్యాపేట , మనసాక్షి:

రాష్ట్ర విభజన హామీలు అమలు చేయని మీరు తెలంగాణా రాష్ట్రానికి వచ్చే అర్హత లేదని సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు. సిపిఐ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు, సూర్యాపేట సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలో ఖమ్మం చౌరస్తా భీమ్ రామ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల జండాలతో నరేంద్రమోడీ గో బ్యాక్ అంటూ నిరసన వ్యక్తం చేస్తూ రాస్తారోక నిర్వహించారు.

 

ఈ సందర్బంగా బెజవాడ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రం పట్ల విపక్షత చూపుతూ లాభాలలో నడుస్తున్న తెలంగాణా సిరుల తల్లిగా పేరుందిన సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేసి, కోల్ండియాకు అప్పగించాలని దుర్బుద్ది తో తెలంగాణకు వస్తున్నాడని ఆయనకి అడుగుపెట్టే నైతిక అర్హత లేదని ఆయన అన్నారు. తెలంగాణకు తీరని అన్యాయం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ, వందే భారత్ రైలు ప్రారంభం కోసం హైదరాబాదుకు రావటం సిగ్గుచేటు అన్నారు.

 

విభజన హామీలైన బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా, గిరిజన విశ్వవిద్యాలయం లాంటి రాష్ట్ర విభజన హామీలు అమలు చేయని నరేంద్ర మోడీకి తెలంగాణలో అడుగుపెట్టే నైతిక హక్కు లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వ విధానాల వలన దేశంలో వివిధ రంగాల్లో జరుగుతున్న అన్యాయాలను ప్రజలు గ్రహిస్తున్నారని,దేశ సమైక్యత, సమగ్రతకు భంగం కలిగిస్తూ ఫాసిస్టు నిరంకుశ హిట్లర్ ను మరిపించేలా పాలనను కొనసాగిస్తున్న ఆయనను వచ్చే ఎన్నికల్లో ఇంటికి పంపడం ఖాయమని ఆయన అన్నారు.

 

కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో లాభాలతో నడిచే బ్యాంకులు, ఎల్ ఐ సి లాంటి ఇన్సూరెన్స్ కంపెనీలను,ఉక్కు, బొగ్గు, రైల్వే, విమానయానం ఆయిల్ కంపెనీలు,నౌకాశ్రయాలు ఆఖరుకు రక్షణ రంగంతో సహా ఒకటేమిటి అన్ని రంగాలను ప్రైవేటీకరణ చేసేలా చట్టాలు అమలు చేస్తున్న మోడి, అదానిలాంటి మోసపూరిత కార్పొరేట్ సంస్థలకు దేశాన్ని అమ్మివేస్తూ, తిరిగి కార్పొరేట్లపై దేశం ఆధారపడేలా పాలన కొనసాగిస్తున్నాడని ఆయన అన్నారు.

 

రాష్ట్రంలో బిజెపి అధ్యక్షుడు కొనసాగుతూ బండి సంజయ్ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఒక తీవ్రవాద కంటే డేంజర్ గా తయారైన విమర్శించారు.ఈ కార్యక్రమం లో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యురాలు అనంతుల మల్లేశ్వరి, రైతు సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు మూరగుండ్ల లక్ష్మయ్య, పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, ఏ ఐ టి యు సి నియోజకవర్గ అధ్యక్షులు చామల అశోక్,

 

నియోజకవర్గ కార్యదర్శి నిమ్మల ప్రభాకర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు గోపగాని రవి, రిక్షా యూనియన్ నాయకులు పెండ్ర కృష్ణ, జిల్లా మైనారిటీ నాయకులు పాషా, వాడపల్లి గోపి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు