Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణమెదక్
విద్యుత్ షాక్ తో ఆవు మృతి
విద్యుత్ షాక్ తో ఆవు మృతి
దుబ్బాక, మనసాక్షి:
ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో ఆవు మృతి చెందిన సంఘటన మండల కేంద్రమైన దుబ్బాకలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి…
దుబ్బాక పట్టణానికి చెందిన తునికి పోశయ్య అనే రైతుకు చెందిన ఆవు గడ్డి మేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ వైరు తగిలి షాక్ తగలడంతో అక్కడికక్కడేమృతి చెందింది. ఆవు మృతితో రైతు పోచయ్యకు 30 వేల ఆస్తి నష్టం వాటిల్లిందని వాపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతు కోరాడు.









