సూర్యాపేట : వైయస్సార్ టిపి నేత పిట్ట రాంరెడ్డి అరెస్ట్
సూర్యాపేట : వైయస్సార్ టిపి నేత పిట్ట రాంరెడ్డి అరెస్ట్
వైఎస్సార్టీపీ శ్రేణులు, పోలీసులకు మధ్య తోపులాట
పోలీసులు అనుసరిస్తున్న తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం
సూర్యాపేట , మనసాక్షి
వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైస్ షర్మిల ఆదేశాలమేరకు సూర్యాపేట నియోజకవర్గ కోర్డినేటర్ పిట్ట రాంరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం సూర్యాపేట పట్టణంలో కొత్త బస్టాండ్ వద్ద కేసిఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా పిట్ట రాంరెడ్డి మాట్లాడుతూ..
పేపర్ల లీక్ ఘటనపై ఐటీ మంత్రి కేటీఆర్ సిగ్గుపడాలని అన్నారు. కాన్ఫిడెన్షియల్‌గా ఉండే పాస్‌వర్డ్‌లు నిందితుల చేతికి ఎలా వెళ్లాయని ప్రశ్నించారు. పేపర్ల లీక్ వ్యవహారంలో సిట్‌తో విచారణ సరికాదని.., సీబీఐతో విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
టి ఎస్ పి ఎస్ సి ది పెద్ద స్కాం. ఇది అందరూ కుమ్మక్కు అయ్యి చేసిన స్కాం అన్నారు.. టి ఎస్ పి ఎస్సి పేపర్ లీక్ వ్యవహారం సి బి ఐ తో దర్యాప్తు చేయించాలని కోరారు.. బోర్డు ఛైర్మన్ దగ్గర నుంచి మంత్రుల స్థాయిలో హస్తం ఉందని. ప్రశ్న పత్రాలు కావాలనే లీక్ చేశారు. బోర్డ్ మొత్తం రద్దు చేయాలని. సిట్‌తో దర్యాప్తు కరెక్ట్ కాదన్నారు.
సిట్ మీకు అనుకూలంగా విచారణ చేస్తుంది. అందుకే సి బి ఐ తో విచారణ చేయాలని డిమాండ్ చేశారు . లేకుంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని టిఎస్ పి ఎస్ సి నిరుద్యోగుల విశ్వసనీయత కోల్పోయిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం టి ఎస్ పి ఎస్సీ లో పరీక్షలు రాసారని వారి జీవితాలతో చెలగాటం అడుతున్నారని విమర్శించారు.
పేపర్ లీకేజీ వ్యవహారం పై ముఖ్యమంత్రి ఇంత వరకు ఎందుకు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.









