సూర్యాపేట : సామూహిక అక్షరాభ్యాసం
సూర్యాపేట : సామూహిక అక్షరాభ్యాసం
నిర్వహించిన కౌన్సిలర్ పావని కృపాకర్
సూర్యాపేట , మనసాక్షి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గర్భిణీలు బాలింతల సంక్షేమానికై ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆరోగ్య లక్ష్మి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని 45వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ అన్నారు.
సోమవారం 45వ వార్డులోని నవత ట్రాన్స్పోర్ట్ అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. గర్భిణీలు, బాలింతలు సరైన పౌష్టికాహారం తీసుకుంటేనే పిల్లలకు పాలు సరిగా అంది ఆరోగ్యంగా ఉంటారని అన్నారు.
అంగన్వాడి కేంద్రంలో గర్భిణీగా నమోదైన నాటి నుంచి డెలివరి అయ్యే వరకు ఆకుకూరలు పప్పు, గుడ్లు, పాలు, తృణధాన్యాలతో పౌష్టికాహారం అందించడం జరుగుతుందన్నారు. అంగన్వాడి కేంద్రంలో అందించే పౌష్టికాహారాన్ని గర్భిణీలు బాలింతలు సద్వినియోగం చేసుకొని తమ చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి అంగన్వాడీల బలోపేతానికి విశేష కృషి చేస్తున్నారని అన్నారు. గర్భిణీ గా నమోదైన నాటి నుంచి ప్రసవమై చిన్నారి పాఠశాలకు పోయే వరకు ఉచిత ప్రయాణ సౌకర్యం, ఉచిత ప్రసవం, అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం, కెసిఆర్ కిట్ సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందన్నారు. చిన్నారులకు ఏడవ నెల నుండి రెండు సంవత్సరాల వయసు వరకు బాలామ్ర్రతం, గుడ్లు ఇస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బిఆర్ఎస్ నాయకులు గండూరి కృపాకర్, అంగన్వాడి టీచర్ పెద్దిరెడ్డి మల్లేశ్వరి గర్భిణీలు బాలింతలు కావేరి, స్వరూప, త్రివేణి, నాగేశ్వరి, సంఘవి, మృదుల, దివ్య, నవనీత, శ్రీలక్ష్మి, మానస, టిఆర్ఎస్ నాయకులు సంగిశెట్టి వెంకటేష్, మృదులాగర్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.









